తెలంగాణ

ప్రభుత్వ వైఫల్యాలపై నేడు టీడీపీ ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 12: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలు నానాబాధలు పడుతున్నారని, దీన్ని నివారించడానికే టీడీపీ శుక్రవారం ధర్నా చౌక్ వద్ద భారీ ధర్నా చేపట్టాలని ఆ పార్టీ నేతలు సమాయాత్తం అవుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, వీటికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ధర్నాకు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి పార్టీ కేడర్‌తో పాటు ముఖ్యనేతలు హాజరు అవుతారని ఆపార్టీ మీడియా కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
గొల్లపూడి మారుతీరావు మృతి తీరనిలోటు
సినీ పరిశ్రమకే కాకుండా అన్ని రంగల్లో తన హాస్యాన్ని, నటనా ప్రతిభను ప్రపంచానికి గుర్తు చేసిన గొల్లపూడి మారుతీరావు మృతి తీరనిలోటు అని టీడీపీ పార్టీ పేర్కొంది. ఆయన కుటంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ఆ పార్టీ అధ్యక్షుడు రమణ తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే మల్లేశం సేవలు మరువలేం
మాజీ ఎమ్మెల్యే మాలెం మల్లేశం అకాల మృతి పట్ల టీడీపీ ప్రగాఢ సంతాపాన్ని తెలిపింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యదర్శి నారాలోకేష్, టీఎస్ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖరరెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి అరవింద్ గౌడ్ సంతాపాన్ని తెలిపారు.