తెలంగాణ

ఐలమ్మ స్ఫూర్తితో పోరాడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొండపాక/ తొగుట, జూలై 17: రాజ్యాంగం కల్పించిన హక్కులకే రక్షణ లేకుండా పోయింది, ఇక ప్రభుత్వ జిఓలు, చట్టాలతో ఎలా న్యాయం జరుగుతుందని, 2013, 123జిఓల ముచ్చటే వద్దని విరసం నేత వరవరరావు అన్నారు. చాకలి ఐలమ్మ స్ఫూర్తితో భూనిర్వాసితులు అలుపెరుగని పోరాటం చేస్తే విజయం వరిస్తుందన్నారు. ఆదివారం మెదక్ జిల్లా కొండపాక మండలం ఎర్రవల్లి, తొగుట మండలం పల్లెపహాడ్, వేములఘాట్ కొమురవెళ్లి మల్లన్నసాగర్ ముంపుగ్రామాల్లో కొనసాగుతున్న రిలేదీక్షలకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భూ నిర్వాసితులకు న్యాయం చేసే ఉద్దేశం ఉంటే 19న జరిగే రౌండ్‌టేబుల్ సమావేశానికి హాజరు కావాలన్నారు. హిట్లర్, నిజాంలే ప్రజాపోరాటాలకు తలొగ్గారని, ప్రభుత్వం లెక్కకాదన్నారు. సింగూరులో ప్రజలు పోరాడి ఇండోనేషియాకు చెందిన సలీం కంపెనీని నిలువరించారని, సోంపేటలో నాగార్జున ఫర్టిలైజర్ కంపెనీని నిలువరించారన్నారు. స్వావలంభన గల తెలంగాణ కోసం సమ్మక్క సారక్క, దొడ్డి కొమురయ్య, ఐలమ్మ పోరాడారని, అన్ని వనరులున్న భూనిర్వాసితులు అదే స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. మల్లన్నసాగర్ నిర్మాణం ప్రజల కోసం కాదని, కాంట్రాక్ట్‌దారులు, ఫాంహౌస్‌ల కోసమే అన్నారు. ప్రజల కోసం నిర్మించే ప్రాజెక్టులే అయితే చిన్న ప్రాజెక్టులు నిర్మించి నీరు అందించ వచ్చాన్నారు. ఒకేచోట 50 టిఎంసిల సామర్థ్యం ప్రాజెక్టు ఎందుకు అని ప్రశ్నించారు. పెద్ద పెద్ద రిజర్వాయర్లు నిర్మించి గ్రామాలు తొలగించిన దాఖలాలు ఎక్కడాలేదన్నారు. లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెపుతున్న ప్రభుత్వం అది ఏ రైతుల కోసమో చెప్పాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్, హీరాకుడ్, బాక్రానంగల్‌లో నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరుగలేదన్నారు. మల్లన్నసాగర్‌కు చట్టబద్ధత లేదన్నారు. అంబానీ, టాటా, అదానీ, వేదాంత, ఎస్‌ఆర్ వంటి పెట్టుబడిదారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళారులుగా వ్యవహరిస్తున్నారన్నారు. లక్షల కోట్లు ముడుపులు దండుకుంటున్నారన్నారు. భూనిర్వాసితులకు పరిహారం చెల్లిస్తున్నామంటున్నారని, కులవృత్తులు, కూలి పని చేసుకునే వారి పరిస్థితి ఏందని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు బాగుపడ్డారన్నారు. చెంచులు, గోండులు, ఆదివాసీలు, మాదిగల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వారికిచ్చిన రాజ్యాంగ హక్కులు అమలు కావడం లేదని, హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తామన్నారు. భారీ ప్రాజెక్టులు వ్యవసాయం కోసం కాదని, పెట్టుబదిడారుల కోసమేనన్నారు. కూడు,గూడు, గుడ్డ, ఆరోగ్యం, విద్య ఉంటేనే అభివృద్ధి జరిగినట్టని, వాటి కోసం విరసం నిరంతరం పోరాడుతుందన్నారు.
నిర్వాసితుల పోరాటాన్ని విరసం ఆధ్వర్యంలో పాటలు, ఉపన్యాసాలు, సీడిల ద్వారా దేశవ్యాప్తంగా వారి భాషల్లోనే ప్రచారం చేసి మద్దతు కూడగడుతామన్నారు. వైఎస్ లాగే సిఎం ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని, ఎన్నికల ముందు మనవారని నమ్మి ఓటేస్తే కంపెనీ మనుషులుగా మారారని విమర్శించారు. 14గ్రామాలు ముంచి ప్రాజెక్టు నిర్మించే అవసరం లేదన్నారు. నిర్వాసితుల మధ్య చిచ్చు పెట్టి గొడవలు సృష్టిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఎంచుకున్న ప్రణాళిక అమలయ్యే దాకా ప్రాణాలు పోయినా, జైళ్లకుపోయినా పట్టించుకునేది లేదన్నారు. మహిళలని చూడకుండా కేసుల పేరుతో భయపెట్టడం సరికాదన్నారు. నిర్వాసితులంతా ఒకతాటి పైకి వచ్చి పోరాడితే ఫ్రాజెక్టు ఆపవచ్చన్నారు. ప్రజలు ఐక్యంగా ఉండి అధికారులను తరిమికొట్టాలన్నారు. భూమి కోల్పోతున్నారని సింగారంకు చెందిన కరుణాకర్ బెంగతో మృతి చెందగా కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో విరసం సభ్యులు ప్రొ.కాశీం,ఇక్బాల్, చిన్నయ్య, బాసిత్, గీతాంజలి, ప్రజాఫ్రంట్, డిటిఎఫ్ నేతలు సత్తయ్య, చంద్రభాను, భాస్కర్, సర్పంచు నర్సింలు, అమరవీరుల బంధుమిత్రుల సంఘం సభ్యురాలు పద్మ, సిపిఎం నేతలు జయరాజ్, నాగరాజు, పరిపూర్ణాచారి, మల్లేశం, శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి, రమేశ్, నర్సింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నిర్వాసితుల రిలే నిరాహార దీక్షాశిబిరంలో మాట్లాడుతున్న విరసం నేత వరవరరావు