తెలంగాణ

నవజాత శిశువులకు బేబీ కిట్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18:నవజాత శిశువులకు ఉచితంగా బేబీ కిట్స్ ఇవ్వాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచడం, మందులు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం 518 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ప్రభుత్వ వైద్య ఆరోగ్య చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా లైఫ్ సేవింగ్ మెడిసిన్‌తో పాటు నవజాత శిశువులకు బేబీకిట్స్ ఇవ్వాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చర్లకోల లక్ష్మారెడ్డి తెలిపారు. వైద్య పరీక్షలు, శస్త్ర చికిత్స తర్వాత మందులు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. శస్త్ర చికిత్సకు ముందు, తర్వాత వాడే మందుల కోసం 330 కోట్ల విడుదల చేశారు. డిఎంఇ ఆధ్వర్యంలోని బోధనా ఆస్పత్రుల కోసం 144 కోట్లు విడుదల చేశారు. ఎంఎన్‌జె ఆస్పత్రి నూతన బ్లాక్ నిర్మాణం కోసం 31.29 కోట్ల విడుదల అయ్యాయి. అదే విధంగా ఎంఎన్‌జె ఆస్పత్రిని రాష్ట్రా స్థాయిలో స్టేట్ క్యాన్సర్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు.
పది కోట్లతో లైఫ్‌సేవింగ్ మెడిసిన్ కోనుగోలు చేస్తారు. బేబీ కిట్స్ కోసం మూడు కోట్ల రూపాయలు కేటాయించారు. నవజాత శిశువులకు అవసరం అయ్యే బేబీ సోప్, బేబీ ఆయిల్, బేబీ పౌడర్, డైపర్స్ వంటివి బేబీ కిట్స్‌లో ఉంటాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవం అయిన వారికి ఇవి అందజేస్తారు. క్యాన్సర్ విభాగంలో ప్రభుత్వ రంగంలో హైదరాబాద్‌లోని ఎంఎన్‌జె ఆస్పత్రి ఒక్కటే ఉంది. క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతుండడంతో ఆస్పత్రిపై భారం పడుతోంది. దీంతో మరో బ్లాక్ నిర్మించాలని నిర్ణయించారు. అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఖమ్మంలో క్యాన్సర్ సెంటర్ ప్రారంభం అయినట్టు మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు.