తెలంగాణ

నేడు ఆర్టీసి కార్మిక సంఘం ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత తొలిసారిగా జరుగుతున్న ఆర్టీసి కార్మిక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్టవ్య్రాప్తంగా 105 డిపోలలో పనిచేస్తున్న 52,800 మంది కార్మికులు ఓటుహక్కును వినియోగించుకోనున్నట్టు కార్మికశాఖ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఆదివారం సాయంత్రంతో ప్రచారం ముగియగా, ఈనెల 19న (మంగళవారం) రాష్టవ్య్రాప్తంగా అన్ని ఆర్టీసి డిపోలు, కార్యాలయాలు, వర్క్‌షాపుల్లో పోలింగ్ ఉదయం గం. 5.30ల నుంచి సాయంత్రం గం. 6.00 వరకు జరుగుతుంది.
అదే రోజు సా.గం. 6.30లకు కౌంటింగ్ మొదులవుతుంది. ఈనెల 25,26న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ జరుగనుందని ఎన్నికల అధికారి గిరిధర్ తెలిపారు. ఎన్నికల బరిలో పది సంఘాలు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ తెలంగాణ మజ్దూర్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, ఎంప్లారుూస్ యూనియన్ మధ్యే జరుగుతుందని కార్మికులు అంచనా వేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన చివరి ఎన్నికల్లో టిఎంయూ, ఎంప్లారుూస్ యూనియన్ కలసి పోటీ చేసి సంయుక్త విజేతలుగా నిలిచాయి. కాగా ప్రస్తుత ఎన్నికల్లో అవి వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్టీసిలో తీవ్ర గందరగోళ పరిస్థితుల మధ్య తాజా కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి.
ఎవరి ధీమా వారిదే..
ఎన్నికల బరిలో నిలిచిన ఇతర సంఘాలు ఎన్ని ఆరోపణలు చేసినా చివరకు గెలుపు తమదేనని టిఎంయూ నాయుకులు విశ్వాసంతో ఉన్నారు. వేతన సవరణ, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ బకాయిలలో బాండ్ల రద్దు, సర్వీసులో చనిపోయిన కార్మికులకు రికవరీ లేకుండా రూ. 6 లక్షలు చెల్లింపు తదితర హామీలతో ఎన్‌ఎంయూ ధీమాతో ఉంది. కాంట్రాక్టు కార్మికుల క్రమబద్ధీకరణ, 44 శాతం ఫిట్‌మెంట్, గ్రేడ్ పి విధానం అమలు వంటివి తమ విజయాలేనంటూ ఎంప్లారుూస్ యూనియన్ గట్టి ధీమాతో ఉంది.