తెలంగాణ

ఆలయాల జీర్ణోద్ధరణకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: రాష్ట్రంలో కొత్త ఆలయాల నిర్మాణం, చారిత్రక, పురాతన ఆలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. శిథిలావస్థలో ఉన్న ఆలయాల జీర్ణోద్ధరణ, బలహీన వర్గాల కాలనీల్లో నిర్మించే ఆలయాలకు కామన్‌గుడ్ ఫండ్ నుంచి నిధులు వెంటనే మంజూరు చేయాలని దేవాదాయ శాఖ మంత్రి ఎన్ ఇంద్రకరణ్‌రెడ్డి ఆదేశించారు. సర్వశ్రేయోనిధిపై దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. కామన్ గుడ్ ఫండ్ ద్వారా వచ్చిన ప్రతిపాదిత ఆలయాలకు 3.5 కోట్ల రూపాయలు విడుదల చేయాలని నిర్ణయించారు. వేములవాడ, యాదగిరిగుట్టలో వేదపాఠశాలలు నిర్మించాలని నిర్ణయించారు. గతంలో కామన్‌గుడ్ ఫండ్ కింద నిధులు పొందాలంటే ఆలయ వార్షిక ఆదాయం ఐదులక్షల కన్నా తక్కువ ఉండాలనే నిబంధనను పది లక్షలకు పెంచుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది. సిజియఫ్ కింద నిధులు పొందే ఆలయాలు గతంలో 20వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉండగా, ఇప్పుడు 50వేల రూపాయలకు పెంచారు. ఆదిలాబాద్ జిల్లా బాసర, లచ్చులపురంలో స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న వేద పాఠశాలలకు సిజియఫ్ నుంచి నిధులు కేటాయించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖకు ప్రత్యేక కోటా కింద 50 కోట్ల రూపాయలు కేటాయించినందుకు ముఖ్యమంత్రికి సిజియఫ్ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.
కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి ప్రణాళిక
శ్రీకాళేశ్వర ఆలయాభివృద్ధికి ఆర్కిటెక్ట్ రూపొందించిన బృహత్ ప్రణాళికను అధికారులు దేవాదాయ శాఖ మంత్రికి వివరించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆలయ నమూనాను మంత్రికి చూపించారు. 25కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను వివరించారు. ఇది తాత్కాలిక నమూనా మాత్రమేనని, ముఖ్యమంత్రికి చూపించిన తర్వాత మార్పులు చేర్పులతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో తొమ్మిది లక్షల 21వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. బొగ్గుల కుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో మంత్రి మొక్కను నాటారు.