తెలంగాణ

నిమజ్జనానికి ప్రత్యేక చెరువులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి నగరం అంతా వివిధ ప్రాంతాల్లో వికేంద్రీకృత ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ ముందు ప్రభుత్వం ఒక అఫిడవిట్ దాఖలు చేసింది. బెంగలూరులో అనుసరిస్తున్న రీతిలో హైదరాబాద్‌లోనూ చిన్నచిన్న చెరువులను ఏర్పాటు చేస్తామని, అందులో 8 అడుగుల ఎత్తయిన విగ్రహాలను నిమజ్జనం చేయవచ్చని పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతిస్తారా లేదా అనే అంశంపై అఫిడవిట్‌లో ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక ప్రస్తావనా చేయకున్నా ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది మాత్రం హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం లేకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.
గతంలో న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలను ప్రభుత్వం పాటించడం లేదని పేర్కొంటూ వేణుమాధవ్ అనే న్యాయవాది దాఖలు చేసిన పిటీషన్‌ను విచారించిన సందర్భంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అఫిడవిట్ దాఖలు చేసింది.
ఇంత ఫీజులా?
ప్రైవేటు పాఠశాలల్లో 7 నుండి 10 లక్షల వరకూ ఫీజులు వసూలుచేయడాన్ని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటీషన్‌పై తాత్కాలిక న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ ఎ వి శేష సాయిలతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం నాడు విచారించింది. అత్యధికంగా ఫీజులు వసూలుచేస్తున్నా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సంఘం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. ఏకమొత్తంలో ఫీజులను వసూలు చేస్తున్నాయని పిటీషనర్ తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చినపుడు ఏ అధికారంతో స్కూళ్లు ఈ ఫీజులను వసూలు చేస్తున్నాయి అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. ఫీజులకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించాలని హైకోర్టు బెంచ్ ప్రభుత్వానికి సూచించింది.