తెలంగాణ

ముస్లిం వెబ్‌సైట్లు హ్యాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: అంతర్జాతీయ, కేంద్ర నిఘా సంస్థలు ఉగ్రవాద సంస్థల వెబ్‌సైట్లను గుర్తించి వారి డేటాను సేకరిస్తున్న నేపథ్యంలో గుర్తుతెలియని హ్యాకర్లు రెండు ముస్లిమ్ డేటింగ్ వెబ్‌సైట్‌లను హ్యాకింగ్ చేసి సుమారు రెండు లక్షల మంది డేటా లీక్ చేసినట్టు ఎన్‌ఐఏ వర్గాల ద్వారా తెలిసింది. ఈ హ్యాకింగ్‌తో ముస్లిమ్ మ్యాచ్ డాట్ కాం. షాదీ డాట్ కాం వెబ్‌సైట్‌లు ఉన్నట్టు తెలుస్తోంది. రెండు లక్షల యూజర్లతోపాటు వారి ఈ-మెయిల్ అడ్రసులు, పాస్‌వర్డులను హ్యాకర్లు తస్కరించినట్టు తెలుస్తోందని సైబర్ క్రైం అధికారులు చెబుతున్నారు. హ్యాకర్లు సుమారు రెండు లక్షల మంది నెటిజన్ల సమాచారంతోపాటు 8 లక్షల ప్రైవేటు మెసేజ్‌ల డేటాను ఆన్ లైన్‌లో లీక్ చేసినట్టు ఇటీవల సోషల్ మీడియాలో ప్రకటించినట్టు తెలుస్తుందని సైబర్ క్రైమ్ అధికారులు పేర్కొంటున్నారు. వీటితోపాటు ఆఫ్రికా డేటింగ్ డాట్ కాం. అడల్డ్ సింగిల్ సైట్స్ డాట్ కాంలు కూడా హ్యాకింగ్ చేసినట్టు తెలుస్తుందని, వినియోగదారులు తమ పాస్ వర్డులను మార్చుకోవాలని వెంటనే మార్చుకోవాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ అధికారి ఒకరు తెలిపారు.