తెలంగాణ

టిఎంయూదే ఆర్టీసీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ గుర్తింపు కార్మిక సంఘానికి మంగళవారం జరిగిన ఎన్నికలు టిఎంయూ విజయదుందుభి మ్రోగించింది. ఒక్క ఖమ్మం వినా అన్ని జిల్లాల్లోనూ స్పష్టమైన మెజారిటీ సాధించింది. సాయంత్రం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి జిల్లాలోనూ టిఎంయూ విజయ పరంపర కొనసాగింది. తెలంగాణవ్యాప్తంగా 95 డిపోల్లో 92 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 49,600 మంది కార్మికులు ఓటు హక్కును వినియోగించుకున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. కరీంనగర్ జిల్లాలో మ్తొతం పది డిపోలు ఉండగా తొమ్మిది డిపోల్లో టిఎంయు విజయం సాధించింది. వేములవాడ డిపోలో మాత్రం ఈయూ గెలిచింది. నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని ఎనిమిదేసి డిపోల్లోనూ టిఎంయు గెలిచింది. ఖమ్మంలో నాలుగు డిపోలుండగా నాలుగింటిని ఎస్‌డబ్ల్యుఎఫ్, ఈయూ కూటమి సాధించాయ. మెదక్‌లోని ఏడింటిలోనూ టిఎంయు గెలిచింది. ఆదిలాబాద్‌లో నాలుగు డిపోలు ఉండగా, మూడింటిలో టిఎంయు, ఒక్కదానిలో ఈయూ గెలిచింది. మహబూబ్‌నగర్‌లో ఎనిమిది డిపోలు ఉండగా, ఆరు డిపోల్లో టిఎంయు గెలిచింది. రంగారెడ్డిలో నాలుగు డిపోలు ఉండగా, మూడింటిలో టిఎంయు, ఒక్క డిపోలో ఎన్‌ఎంయు గెలిచింది.
మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్‌లలో టిఎంయూ క్లీన్ స్వీప్. కాగా ఖమ్మంలో మాత్రం ఎస్‌డబ్ల్యుఎఫ్, ఈయూ కూటమి సత్తా చాటుకుంది. మెజారిటీ డిపోలను కైవసం చేసుకోవడంతో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్మిక సంఘం నేతలు, కార్మికులు సంబురాలు జరుపుకుంటున్నారు. కాగా ఈనెల 25,26తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ జరుగనుంది. తుది ఫలితాలు ఆగస్టు 8న వెలువడనున్నట్టు రిటర్నింగ్ అధికారి తెలిపారు.
కార్మికులకు కృతజ్ఞతలు
తెలంగాణ మజ్దూర్ యూనియన్‌పై నమ్మకంతో ఓట్లు వేసి రాష్టల్రోని అత్యధిక డిపోలను కైవసం చేసుకునేలా సహకరించిన కార్మికులకు టిఎంయూ నేత అశ్వథామ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టిఎంయూ సాధించిన వేతన బకాయిలు, కార్మికుల రెగ్యులరైజేషన్, ఫిట్‌మెంట్ వంటివే తమ విజయానికి కారణమయ్యాయన్నారు. 2017లో మెరుగైన పేస్కేల్ టిఎంయూతోనే సాధ్యమని కార్మికులు నమ్మారన్నారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు ఈ ఎన్నికలు రెఫరెండం అని అశ్వథామరెడ్డి పేర్కొన్నారు.
నడవని బస్సులు..ప్రయాణికుల ఇబ్బందులు?
ఆర్టీసి ఎన్నికల సందర్భంగా నగరంలో చాలా రూట్లలో బస్సులు నడువలేదు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవలసి వచ్చింది. పోలింగ్‌కు తోడు వర్షం కురియడంతో బస్సుల సంఖ్య తగ్గింది. కార్మికులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు మంగళవారం ఉదయం గం. 5.00ల నుంచే బారులుదీరడంతో ఉదయం వేళల్లో నడిచే బస్సులు కొన్ని ఆలస్యం గానూ, మరికొన్ని బస్సులు రద్దయ్యాయి.