తెలంగాణ

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌కు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో నిర్వహించనున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌లో 20 దేశాల నుంచి 40కి పైగా అంతర్జాతీయ కైట్ ప్లేయర్లు పాల్గొంటున్నారని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్‌ను ఈనెల 13 నుంచి 15 వరకు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. శనివారం సాయంత్రం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఫెస్టివల్ వివరాలను వెల్లడించారు. దేశ నలు ములల నుంచి 25 రాష్ట్రాలకు చెందిన 60 మంది జాతీయ స్థాయి కైట్ ప్లేయర్లు పాల్గొంటున్నారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఫెస్టివల్‌లో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంటిలో తయారు చేసిన స్వీట్‌లను ఈ ఫెస్టివల్‌లో అమ్మకాలు జరుపుతారని మంత్రి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంప్రదాయ ఆటను ఈ వేడుకల్లో నిర్వహిస్తున్నామన్నారు.
దేశ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కైట్ ప్లేయర్లు, సందర్శకులు ఈ ఫెస్టివల్స్‌లో పాల్గొంటారని తెలిపారు. రాబోయే కాలంలో ఈ ఫెస్టివల్‌ను మూడు రోజులకు పరిమితం కాకుండా, వారం రోజులపాటు నిర్వహిస్తామన్నారు. అన్ని రకాల సాంప్రదాయబద్దమైన పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, షాపింగ్, వంటకాలు అన్ని ఏర్పాట్లను అందుబాటులో ఉంచేల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ ఫెస్టివల్‌ను తిలకించేందుకు వచ్చే సందర్శకులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
మీడియా సమావేశానికి ముందు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇతర అధికారులతో కలిసి సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహిస్తున్న 5వ అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో టూరిజం చైర్మన్ భూపతిరెడ్డి, టూరిజం ఏండీ మనోహర్, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, క్లిక్ ప్రతినిధులు పాల్గొన్నారు. కైట్ ఫెస్టివల్ సందర్భంగా తెలంగాణ సంప్రదాయ క్రీడలు కూడా నిర్వహిస్తున్నారని అందుకు తగట్టుగా మైదానంలో ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్) డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నర్సయ్య తెలిపారు.
'చిత్రం... అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ,సంప్రదాయ క్రీడలకు సంబంధించిన పరికరాలను చూపిస్తున్న పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్స్ డిప్యూటీ డైరెక్టర్ నర్సయ్య తదితరులు