తెలంగాణ

సీనియర్లతో సమన్వయ కమిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 12: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న టీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాసరెడ్డి, బొంతు రామ్మోహన్, గట్టు రాంచందర్ రావు. దండె విఠల్, ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, నవీన్‌రావు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటు చేసిన ఈ కమిటీ వ్యూహాలతో ప్రచారంలో ఉన్న నేతలను నడిపిస్తుంది. కమిటీ సభ్యులు జిల్లాల వారీగా బాధ్యత తీసుకుని పనిచేయాలని టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ ఆదేశించారు. ఈ ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు చేసే విమర్శలకు దీటుగా సమాధానం ఇవ్వాలన్నారు. రెబెల్స్‌గా పార్టీ తరఫున నామినేషన్లు వేసిన అభ్యర్థులతో ఈనెల 14వరకు మాట్లాడి, వాటిని ఉపసంహరించుకునేలా చూడాలన్నారు. ఈ ప్రక్రియపైన ప్రధాన దృష్టి పెట్టాలన్నారు. సాధ్యమైనంత
ఎక్కువగా ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేయాలన్నారు. ఎన్నికలు పూర్తయ్యేదాకా ఈ కమిటీ ప్రతిరోజూ పార్టీ కార్యాలయం నుంచి వీలైనంత ఎక్కువ సమయం పనిచేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డులను భారీ మెజారిటీతో గెలుచుకుంటామని కేటీఆర్ అన్నారు. పది కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రత్యేక వ్యూహం ఖరారు చేశామన్నారు. ఈ ఎన్నికలు తమ పార్టీకి ఎంతో కీలకమైనవన్నారు. కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, బడంగ్‌పేట్, మీర్‌పేట్, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫిర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట కార్పొరేషన్లలోని క్షేత్రస్థాయి పరిస్థితులపై కూడా ఆయన చర్చించారు. స్వయంగా కార్పొరేషన్ల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన మాట్లాడారు. పార్టీ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున జనంలోకి తీసుకుపోవాలన్నారు. హైదరాబాద్ శివార్లలోని కార్పొరేషన్లపై పార్టీ ప్రత్యేకంగా దృష్టిపెట్టినందున వాటిలో విజయం ఎంతో కీలకమన్నారు. నిజామాబాద్, కరీంనగర్ కార్పొరేషన్లలో కాంగ్రెస్, బీజేపీ లోపాయికారిగా కుమ్మక్కై పనిచేస్తున్నాయని, వీరి లోగుట్టును ప్రజలకు తెలియచేయాలన్నారు.

'చిత్రం... పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆదివారం సమావేశమైన టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్