తెలంగాణ

అన్నిచోట్లా టీఆర్‌ఎస్ జెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో అసెంబ్లీ, జడ్పీపీ ఎన్నికల ఫలితాలు పునరావృతమవుతాయని, అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురువేస్తుందని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందర్, జడ్పీ చైర్మన్ పుట్టా మధు అన్నారు. ఆదివారం ఇక్కడ వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ విపక్ష పార్టీలకు అభ్యర్థులు కరవయ్యారన్నారు. అభ్యర్థులు లేక పరువు నిలబెట్టుకునేందుకు బీజేపీ నేతలు అభ్యర్థులను వెతుక్కుంటున్నారన్నారు. సెంటిమెంట్‌తో కొంత మంది ఎంపీ ఎన్నికల్లో ఓట్లు వేసినా ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ స్థానం ఎక్కడుందో ఇటీవల జరిగిన హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో తేలిపోయిందన్నారు. హుజూర్‌నగర్‌లో బీజేపీకి మూడు వేల ఓట్లు కూడా రాలేదన్నారు. రాష్ట్రంలో ఇంకా 20 ఏళ్లు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు. కేంద్ర నాయకత్వానికి ఏమీ చెప్పుకోలేక ఎవరికో ఒకరికి టికెట్లను బీజేపీ ఇస్తోందన్నారు. రాష్ట్రంలో అనేక సంస్కరణలు తెచ్చిన ఘనత తమ పార్టీదేనన్నారు. మున్సిపల్, ఐటీ మంత్రిగా కేటీఆర్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నరన్నారు. అన్ని పట్టణాల్లో అభివృద్ధికి ప్రణాళికలు ఉన్నాయన్నారు. బీజేపీ గెలిచి చేసేదేమీ ఉండదన్నారు. రాష్ట్రానికి బీజేపీ నేతలు కొత్తగా ఎలాంటి నిధులు ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రం నుంచి వందలాది కోట్ల రూపాయలు కేంద్రానికి ఆదాయం వెళ్తోందన్నారు. రెబెల్ అభ్యర్థులకు బీ ఫారాలు ఇచ్చేందుకు బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నించాయన్నారు. 100కుపైగా మున్సిపాలిటీల్లో గెలుస్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారన్నారు. ప్రజలు టీఆర్‌ఎస్ వెంట ఉన్నారన్నారు.
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ బీజేపీకి తెలంగాణలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదన్నారు. తన గురించి తాను బీజేపీ అతీగా ఊహించుకుంటోందన్నారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా సవాళ్లు చేయడం తగదన్నారు. దమ్ముంటే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బహిరంగ చర్చకు ముందుకు రావాలన్నారు. తమ ప్రభుత్వాన్ని ప్రజలు మెచ్చుకుంటే, బీజేపీ నేతలు చిల్లర వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఆరేళ్లలో ప్రభుత్వ పాలన గత ప్రభుత్వ పాలన కంటే మెరుగుగా ఉందన్నారు. బీజేపీ నేతలు ఇష్టం వచ్చినట్లు ప్రకటనలు చేసి నవ్వులపాలు కావద్దన్నారు.

'చిత్రం... తెలంగాణ భవన్‌లో ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్