తెలంగాణ

కర్ఫ్యూ విధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కర్ఫ్యూను సడలించామని వెల్లడించారు. ప్రజలు సహితం ఒక్క దగ్గర గుంపులు గుంపులుగా నిలబడవద్దని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పట్టణ ప్రజలు పుకార్లు నమ్మొద్దని అన్నారు. అపరిచిత వ్యక్తులు కాలనీల్లో తిరిగితే పోలీసు సిబ్బందికి సమాచారం అందించాలని పేర్కొన్నారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖకు ప్రజలు తమవంతుగా సహకరించాలని సూచించారు.
'చిత్రం...గాయపడిన నిర్మల్ ఎస్పీ శశిధర్‌రాజు