తెలంగాణ

నిఘా నీడన భైంసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, జనవరి 14: నిర్మల్ జిల్లా భైంసాలో ఆదివారం రాత్రి విధ్వంస ఘటన నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. భయంతో ఊరొదలి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. భైంసాలోని కొరవగల్లీ, పాండ్రి గల్లీ, బట్టీ గల్లీ వంటి కాలనీల్లోని ప్రజలు ఇళ్లను వదిలి బంధువుల ఇళ్లకు పయనమవుతూ కనిపిస్తున్నారు. దీంతో కాలనీలన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. కొరవ గల్లీలో ఘటన చోటుచేసుకున్న ప్రాంతం భయంకరంగా మారింది. ఆ కాలనీలో పోలీసులు మాత్రమే దర్శనమిస్తున్నారు. విధ్వంస ఘటన ఆనవాళ్లు, రోడ్లపై తగులబడ్డ ద్విచక్ర వాహనాలు, ఇళ్ల సామాగ్రి తొలగించినప్పటికీ పూర్తిగా కాలిన ఇళ్ల నుండి ఇప్పటికీ పొగ వస్తూనే ఉంది. నిరాశ్రయులైన ప్రజలు బతుకు జీవుడా అంటూ బంధువుల ఇళ్లకు రోదిస్తూ వెళ్తున్న ఘటనలు భైంసాలో చోటుచేసుకుంటున్నాయి. ఘటన జరిగిన రెండు రోజులు గడుస్తున్నా.. ప్రజలు మాత్రం ఎప్పుడు ఏ ఘటన చోటుచేసుకుంటుందోనని భయం భయంగా కాలం గడుపుతున్నారు.
తెల్లవార్లూ జాగరణ..
కొరవ గల్లీ విధ్వంస ఘటన భైంసా పట్టణ ప్రజలకు కంటి నిండా కునుకు లేకుండా చేసింది. ఆయా కాలనీల ప్రజలు భయంతో గుంపు గుంపులుగా చేరి తెల్లవారూల జాగారం చేస్తూ గడిపేశారు. ప్రధాన వీధుల కూడళ్ల వద్ద చలి మంటలు కాస్తూ రాత్రంతా ఒకరికొకరు తోడుగా ఉన్నారు. కాలనీల్లో ఎవరికి వారు అప్రమత్తంగా ఉంటూ మహిళలు, పిల్లలను ఇళ్లలో ఉంచి ప్రధాన వీధుల్లో జాగారం చేసి రక్షణ ఏర్పాట్లను చేసుకున్నారు.
సంబరాలకు నోచుకోని సంక్రాంతి..
భైంసా ప్రజలకు సంక్రాంతి పండుగ చేదు అనుభవాన్ని మిగిల్చిందనే చెప్పాలి. సెలవుల్లో పిల్లలంతా ఇళ్లలోకి చేరగా బంధువులతో కళకళలాడే సంక్రాంతి పండుగ ఈ దఫా సంబరాలకు నోచుకోలేదు. సంక్రాంతికి భైంసాకు వచ్చే బంధువులు సైతం కర్ఫ్యూ నేపథ్యంలో భైంసాకు రాలేకపోయారు. కనీసం పండుగ కోసం సరుకులైన కొని నోములు పంచుకుందామనుకున్న మహిళల ఆశలు దుకాణాల బంద్‌తో నీరుగారాయి. సెలవుల్లో పండుగకు వచ్చిన పిల్లలకు కనీసం పిండి వంటలు సైతం చేయడానికి కుదరడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

''చిత్రాలు.. ఆదివారం జరిగిన దాడిలో ధ్వంసమైన కాలనీ నిర్మానుష్యంగా మారిన దృశ్యం
* గస్తీ నిర్వహిస్తున్న ఆర్‌ఏఎఫ్ దళాలు