తెలంగాణ

ప్రధానితో చర్చకు తెలంగాణ విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 20వ తేదీన న్యూఢిల్లీలో నిర్వహించే ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొనేందుకు తెలంగాణ నుండి 19 మంది ఎంపికయ్యారు. న్యూఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ప్రధాని 2200 మంది విద్యార్ధినీ విద్యార్థులతో ముచ్చటిస్తారు. ఇందులో భాగంగానే తెలంగాణ నుండి 19 మంది విద్యార్థులు పాల్గొంటున్నారని పాఠశాల విద్య కమిషనర్ డాక్టర్ విజయకుమార్ చెప్పారు. ఈ కార్యక్రమం దూరదర్శన్, ఆకాశవాణి ద్వారా ప్రత్యక్ష ప్రసారం అవుతుందని ఆయన తెలిపారు. చర్చలో పాల్గొనేందుకు కరీంనగర్ నుండి గణేష్, ఉప్పారి అరవింద్, మురలీ అజ్మీర, నిజామాబాద్ నుండి బెల్గవర్ సునీల్, బీ మహేష్, హాసిని సాదక్, రంగారెడ్డి నుండి ఉగ్గిలి వర్షారెడ్డి, నూకబోయిన యోగ నందిని, తనిని గోపి, భూషర ఖతూన్, వడ్ల అఖిల , బర్నాలి బౌమిక్, హైదరాబాద్ నుండి సౌమ్య కోలావర్, హరిప్రియ తట్టి, అలేఖ్య అంబటి , వరంగల్ నుండి మేఘన పెరుమాండ్ల, రావూరి సాత్వికారెడ్డి, జనగామ నుండి ఆయిషీ తలగశెట్టి ఉన్నారు.
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లకు గడువు: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా పది, ఇంటర్ విద్య పూర్తి చేయాలనుకునే అభ్యర్ధులు ఈ నెల 18 నుండి 28వ తేదీలోగా రుసుములు చెల్లించి ప్రవేశాలు పొందవచ్చని ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ వెంకటేశ్వరశర్మ ఒక ప్రకటనలోతెలిపారు.
విద్యాశాఖకు సీఎస్‌ఐ పురస్కారం: వివిధ సేవల కోసం పాఠశాల విద్యాశాఖ ఇంటిగ్రేటెడ్ స్కూల్ మేనేజిమెంట్ సిస్టం రూపొందించిన ప్రాజెక్టుకు కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా పురస్కారం లభించింది. శుక్రవారం నాడు భువనేశ్వర్‌లో జరిగిన కార్యక్రమంలో సర్వశిక్షా అభియాన్ ప్లానింగ్ అధికారి చంద్రశేఖర్ , టీఎస్ ఆన్‌లైన్ ప్రతినిధులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
ఫిబ్రవరి 23నుండి ఓపెన్ వర్శిటీ పరీక్షలు: అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ డిగ్రీ మొదటి, మూడో సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి నిర్వహిస్తున్నట్టు వర్శిటీ ఒక ప్రకటనలో తెలిపింది. డిగ్రీ రెండో సంవత్సరం మూడో సెమిస్టర్ పరీక్షలు మార్చి 1 నుండి 7వ తేదీ వరకూ జరుగుతాయని అధికారులు చెప్పారు. పరీక్షలకు హాజరయ్యేవారు అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆన్‌లైన్ పోర్టల్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని వారు తెలిపారు.