తెలంగాణ

బీజేపీతో షరతుల్లేని పొత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: లోతుగా అధ్యయనం చేసిన తర్వాతనే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్టు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. శనివారం నాడు గ్రేటర్ హైదరాబాద్ నేతలతో పార్టీ హైదరాబాద్ కార్యాలయంలో సమావేశమయ్యారు. తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా జనసేన పార్టీని బలోపేతం చేయడానికి కొంత సమయం తీసుకున్నట్టు చెప్పారు. పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూనే ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. పార్టీని తెలంగాణలో సైతం బలోపేతం చేసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ముందుగా గ్రేటర్ హైదరాబాద్ కమిటీని నియమించుకుందామని , అర్హులైన పేర్లను కార్యకర్తలే సూచించాలని అవకాశం ఇచ్చారు. కమిటీల ఏర్పాటు కార్యకర్తల అభీష్టం మేరకే జరుగుతుందని చెప్పారు. భారతీయ జనతా పార్టీ పొత్తు గురించి మాట్లాడుతూ అన్ని స్థాయిల నాయకులతో చాలా లోతైన చర్యలు జరిగిన తర్వాతనే తెలుగు రాష్ట్రాలు, దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలు, ప్రజల సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పొత్తు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. గత కొన్ని నెలలుగా బీజేపీ అగ్రనాయకత్వంతో దఫదఫాలుగా చర్చలు జరిగాయని, పొత్తుపై ఇరు పక్షాల నుండి ఎలాంటి షరతులు లేవని వెల్లడించారు. 2014 ఎన్నికల సమయంలోనే బీజేపీతో కలిసి పనిచేశామని, అయితే బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని విధానపరమైన నిర్ణయాలపై జనసేన కార్యకర్తలు పూర్తి అవగాహనతో ఉండాలని పేర్కొన్నారు. పౌరసత్వ సవరణ చట్టం అర్ధం చేసుకోవడంలో చాలా మంది అపోహకు గురవుతున్నారని పవన్ అభిప్రాయపడ్డారు. ఈ చట్టం వల్ల దేశంలో ఏ ఒక్క ముస్లింకూ అపకారం జరగబోదని అన్నారు. ఈ చట్టం రూపకల్పనకు దారితీసిన దేశ విభజన నాటి పరిస్థితులు, భారత్, పాక్ మధ్య ఉన్న ఒప్పందాల గురించి వివరించారు. ఈనాటి ఒప్పందాలను పొరుగుదేశం అమలుచేయకపోవడం కారణంగా అక్కడ మైనార్టీల రక్షణకు ఈ చట్టాన్ని తీసుకురావల్సి వచ్చిందని అన్నారు. ఇక నుండి నెలలో కొన్ని రోజుల పాటు తెలంగాణలో పార్టీ కార్యకలాపాలకు సమయాన్ని కేటాయిస్తానని అన్నారు.
తాడేపల్లిగూడెం, కాకినాడల్లో జనసేన నేతలపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు. అధికారబలంతో పోలీసులను అడ్డుపెట్టుకుని చేస్తున్న ఆగడాలను భరించే స్థితిలో ప్రజలు లేరని అన్నారు.
'చిత్రం...హైదరాబాద్‌లో శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్