తెలంగాణ

గుడ్‌మార్నింగ్... సూర్యాపేట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 20: గుడ్ మార్నింగ్.. సూర్యాపేట్... వినండి.. వినండి.. ఉత్సాహంగా... ఉల్లాసంగా... అంటూ ఎఫ్‌ఎం సేవలు నల్లగొండ జిల్లా సూర్యాపేట ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి అభ్యర్థన మేరకు తక్షణమే సూర్యాపేటలో ఎఫ్‌ఎం స్టేషన్ పనులను ప్రారంభించాలని కేంద్ర సమాచార పౌరసంబంధాల, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు బుధవారం సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఎంపి గుత్తా ఎఫ్‌ఎం స్టేషన్ ఏర్పాటు విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకురాగా అందుకు సానుకూలంగా స్పందించి తక్షణమే ఎఫ్‌ఎం టవర్ ఏర్పాటుకు టెండర్లను ఆహ్వానించి త్వరితగతిన నిర్మాణ పనులు చేపట్టి ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఎఫ్‌ఎం సేవలను అందుబాటులోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. హైదారాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రధాన కేంద్రంగా ఉన్న సూర్యాపేటలో ఎఫ్‌ఎం స్టేషన్‌ను సుమారు తొమ్మిది సంవత్సరాల క్రితం గత యుపిఎ ప్రభుత్వ హయాంలో మంజూరు చేశారు. ఏడేళ్ల క్రితం పట్టణ శివారులోని సుందరయ్యనగర్ వద్ద సర్వే నెంబర్ 70లో ఉన్న రెండెకరాల ప్రభుత్వ స్థలంలో ఎఫ్‌ఎం స్టేషన్ ఏర్పాటు కోసం కేటాయించారు. ఆ స్థలంలో పేదలు గుడిసెలు వేసుకోగా బలవంతంగా వాటిని తొలగించి అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి, రాష్ట్ర ఐటి శాఖ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. అ తర్వాత ఆ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి వదిలేశారు.
ఈ విషయాన్ని ఎంపి గుత్తా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన సానుకూలంగా స్పందించి తక్షణమే ఎఫ్‌ఎం స్టేషన్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవల్సిందిగా అధికారులను ఆదేశించారు. త్వరలో ఎఫ్‌ఎం సేవలు అందుబాటులోకి రానుండంతో ఈ ప్రాంత ప్రజలకు, జాతీయ రహదారిపై ప్రయాణించే వారికి వినోద, విజ్ఞాన సేవలు అందనున్నాయి.

సూర్యాపేటలో ఎఫ్‌ఎం స్టేషన్ కోసం కేటాయించిన స్థలం