తెలంగాణ

మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టో విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: బీజేపీకి మున్సిపాలిటీ ఎన్నికల్లో పట్టం కట్టాలని, మున్సిపాలిటీల అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పనిచేస్తామని బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. ఈ మ్యానిఫెస్టోను బీజేపీ ఆదివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్ రావు మాట్లాడుతూ అన్ని మున్సిపాలిటీల్లో రహదారుల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామన్నారు. పరిసర గ్రామాల్లో రోడ్లను అనుసంధానిస్తామన్నారు. ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి ఇతోధికంగా నిధులు తెస్తామన్నారు. మున్సిపాలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరిస్మాన్నారు. మురికినీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి, సౌర విద్యుత్‌ను అనుసంధానం చేస్తామన్నారు. వరదనీటి నివారణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. బావులు, కుంటలు, చెరువులను పునర్వ్యవస్థీకరిస్తామన్నారు. కేంద్ర సహకారంతో అన్ని గృహాల్లో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మిస్తామన్నారు. వంద గజాలలోపు స్థలంలో నివసిస్తున్న కుటుంబాలకు ఇంటిపన్నును పూర్తిగా రద్దు చేస్తామన్నారు. వంద గజాలలోపు విస్తీర్ణంలో ఉన్న పాత ఇండ్లను ఆధునీకరించుకోవడానికి కొత్త ఇండ్లను నిర్మించుకోవడానికి నిరభ్యంతర పత్రం అవసరాన్ని రద్దు చేస్తామన్నారు. వంద గజాలలోపు విస్తీర్ణంలో ఉన్న ఇండ్లకు ఆస్తిపన్నును రద్దు చేస్తామన్నారు. వందరోజుల్లో అన్ని మున్సిపాలిటీల్లో ఆస్తిపన్నును హేతుబద్ధీకరిస్తామన్నారు. పన్నుల సంస్కరణల ద్వారా వంద శాతం పన్నులు వసూళ్లయ్యేవిధంగా కృషి చేస్తామన్నారు. బీజేపీ పాలిత మున్సిపాలిటీల్లో స్వీయ అంచనా ద్వారా ఆస్తిపన్ను నిర్థారించడానికి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసాస్తమన్నారు. పాల ఉత్పత్తి, పంపిణీ కోసం ప్రత్యేక స్థలాల కేటాయింపు, నాణ్యమైన పాల ఉత్పత్తులు అందించేందుకు స్థలాలను కేటాయిస్తామన్నారు.
ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ అమలుకు ప్రత్యేక నిధులు ఇస్తామన్నారు. పాదాచారుల కోసం ప్రత్యేక పేవ్‌మెంట్ ఏర్పాటు, రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ల నిర్మాణం, ఆధునీకరణ, అవసరమైన చోట్ల , తోపుడు బండ్ల వ్యాపారుల కోసం ప్రత్యేక స్థలాల కేటాయింపు, కొత్త టౌన్‌షిప్‌లకు ప్రోత్సాహం, వార్డుల వారీగా జనతా దర్బార్ ఏర్పాటు, ఇంటి వద్దకే పరిపాలన అందించడం, బస్తీ దవాఖానాల ఏర్పాటు, ప్రతి మున్సిపాలిటీల్లో 300 కెపాసిటీ ఫంక్షన్ హాళ్ల ఏర్పాటు, సీనియర్ సిటిజన్ క్లబ్‌లను నెలకొల్పడం, 10 వేల జనానాకు ఒకటి చొప్పున రూ.5 భోజన కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ పేర్కొంది. ప్రజాభీష్టానికి అనుగుణంగా సమతుల్య, సుస్థిర అభివృద్ధి సాధించడం, అవినీతికి దూరంగా జవాబుదారీతనం, పారదర్శకతతో పరిపాలన సాగించడం, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం, వెనకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బీజేపీ పేర్కొంది. స్థానిక సంస్థల ఆధీనంలో ప్రజాగ్రంథాలయాలు, కంప్యూటర్ కేంద్రాల ఏర్పాటు, ఉచిత ఇంటర్నెట్ అందుబాటులో ఉంచేందుకు కృషి, యాంత్రిక దోబీ ఘాట్‌ల నిర్మాణం, పౌర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. భూకబ్జాలను అరికట్టేటందుకు రికార్డుల కంప్యూటీకరణ, భూకబ్జా బాధితులను ఆదుకోవడం కోసం స్వతంత్రంగా టోల్‌ఫ్రీ నంబర్‌తో సహాయ కేంద్రాల ఏర్పాటు చేస్తామన్నారు.
'చిత్రం... బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేస్తున్న దృశ్యం