తెలంగాణ

మిషన్ భగీరథకు 7న శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజ్వేల్, జూలై 20: మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు చివరి దశకు చేరుకోవడంతో ఆగస్టు 7న ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. సుదర్శన యాగంతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఅర్ ప్రారంభించనుండగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ హాజరయ్యే అవకాశమున్నట్లు మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కోమటిబండలో చేపట్టిన మిషన్ భగీరథ నిర్మాణ పనులను పరిశీలించడంతోపాటు బహిరంగసభ, హెలిప్యాడ్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట ప్రాంతాల నుండి ఈ కార్యక్రమానికి 2 లక్షల మంది హాజరయ్యే అవకాశమున్నందున ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యంగా మరో 10 రోజుల్లో మిషన్ భగీరథ పనులు పూర్తి చేయాలని, ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ ఉన్నతాధికారి ఆర్పీసింగ్, ఇఎన్‌సి సురేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, గఢా అధికారి హన్మంతరావు, అర్‌డబ్ల్యూఎస్‌ఎస్‌ఇ విజయప్రకాశ్, గఢా అధికారి హన్మంతరావు, మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ పాల్గొన్నారు.
పనుల్లో నిర్లక్ష్యాన్ని సహించేదిలేదు: సురేందర్‌రెడ్డి
మిషన్ భగీరథ పనుల్లో సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యాన్ని సహించేదిలేదని మిషన్ భగీరథ ఇంజనీర్ ఇన్ చీఫ్ సురేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్‌తో కలిసి అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 243 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే లక్ష్యంతో సిఎం కెసిఅర్ ప్రత్యేక దృష్టి సారించి మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టగా, ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, 67,551 గృహాలకు నల్లా కనెక్షన్‌లు యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. ముఖ్యంగా మొదటి విడతలో గజ్వేల్, దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాలకు తాగునీటి కోసం గోదావరి జలాలు అందుతుండగా పనులు మరింత వేగవంతం చేసి అందుబాటులోకి తేవాలని తెలిపారు.

అలాగే కోమటిబండలోని ఎతె్తైన కొండపై కోటి 40 లక్షల లీటర్ల నీటి సామర్థ్యం గల సంప్‌తోపాటు 2 ఓవర్‌హెడ్ ట్యాంక్‌ల నిర్మాణాలు పూర్తికాగా గ్రామాల్లో గృహాలకు నల్లా కనెక్షన్‌లు పూర్తి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు.

మిషన్ భగీరథ పనులు, బహిరంగసభ జరిగే ప్రాంతాన్ని పరిశీలిస్తున్న
మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి