తెలంగాణ

రీజనల్ రింగ్ రోడ్డు వ్యయంపై కసరత్తు పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో నాలుగు జిల్లాలను అనుసంధానం చేస్తూ 290 కి.మీ రీజనల్ రింగ్ రోడ్డుకు అయ్యే వ్యయంపై ప్రాథమిక కసరత్తు పూర్తయింది. ఈ రోడ్డును వీలైనంత త్వరలో చేపడతామని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వం 158 కి.మీ పొడువు ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని పూర్తి చేసిన విషయం విదితమే. నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల గ్రామీణ ప్రాంతాలను కలిపే 290 కి.మీ రోడ్డును డబుల్ రోడ్డుగా వేయాలంటే దాదాపు రూ. 2392 కోట్లు ఖర్చవుతాయని అంచనాకు వచ్చారు. అదే నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం చేయాలంటే రూ. 4677 కోట్లు ఖర్చవుతుంది. భూసేకరణకు అయ్యే వ్యయం ఇందులో కలిసి ఉందని హెచ్‌ఎండిఏ అధికారులు తెలిపారు. దాదాపు 125 పెద్ద గ్రామాలను రీజనల్ రింగ్ రోడ్డు కలుపుతుంది. చేవెళ్ల, తూప్రాన్, షాబాద్, షాద్‌నగర్, కొత్తూరు, ములుగు, శివంపేట, నర్సాపూర్, చేవెళ్ల తదితర ప్రాంతాలను కలుపుతుంది. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య కొన్నిచోట్ల పది కి.మీ, మరికొన్నిచోట్ల 30 కి.మీ దూరం ఉంది. ఈ రెండు రోడ్లను అనుసంధానం చేస్తూ 25 రోడ్లను నిర్మించనున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో నాలుగు చోట్ల అడవులు ఉన్నాయి. నర్సాపూర్ వద్ద 4.3కి.మీ, కె పహాడ్ వద్ద 2 కి.మీ, కొతియాల్ వద్ద అర కి.మీ, ములుగు వద్ద 1.7 కి.మీ పొడువున అడవులు విస్తరించి ఉన్నాయి. దీనికి అటవీ శాఖ అనుమతులకు రాష్ట్రప్రభుత్వం దరఖాస్తు చేసింది. ఈ ఏడాది దసరా తర్వాత టెండర్లను ఖరారు చేసి రెండేళ్లలో పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉంది.