తెలంగాణ

కేరళ తరహా ఎన్‌ఆర్‌ఐ విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కేరళ ప్రభుత్వం తరహాలో ప్రవాస భారతీయుల విధానాన్ని తెలంగాణలోనూ రూపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని అధ్యయనం చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించడంతో ఉన్నతాధికారుల బృందం ఆ రాష్ట్రానికి వెళ్లింది. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావుతో కూడిన బృందం మంగళవారం తిరువనంతపురం చేరుకుంది. కేరళ ప్రభుత్వ ప్రవాస కేరళవాసుల సంక్షేమ వ్యవహారాల శాఖ (నాన్ రెసిడెంట్ కేరళైటీస్ అఫైరీస్ డిపార్టుమెంట్) కార్యదర్శి ఇలంగోవన్, సీఈవో
హరికృష్ణ నంబూద్రితో రాష్ట్రం నుంచి వెళ్లిన బృందం సమావేశమైంది. వివిధ దేశాల్లో ఉండే కేరళవాసుల సంక్షేమ కోసం అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, దీని కోసం అవలంభిస్తున్న విధానంపై వారితో విస్తృతంగా చర్చించింది. అక్కడి విధాన పత్రాలను కూడా బృందం అధ్యయనం చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచి విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం పెద్ద ఎత్తున యువత ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్తున్నారు. వారు అక్కడి దేశాలలో అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి చేదోడు, వాదోడుగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. దీని కోసం తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఓ సమగ్ర విధానాన్ని రూపొందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయుల కోసం వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రం నుంచి ఉన్నతాధికారుల బృందం కేరళకు వెళ్లిందని సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

'చిత్రం...కేరళ అధికారులతో మంగళవారం భేటీ అయిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తదితరులు