తెలంగాణ

టెండర్ ఓటు పోలైతే రీ-పోలింగే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 21: రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బుధవారం జరిగే పోలింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి తెలిపారు. ఎన్నికల కమిషన్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఓటర్లంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పోటీ చేసే అభ్యర్థులు లేదా వారి తరఫున కార్యకర్తలు, రాజకీయ పార్టీలు ఓట్లకోసం ఎలాంటి ప్రలోభాలకు ప్రయత్నించినా లొంగవద్దని ఆయన ఓటర్లను కోరారు. ఓటు చాలా విలువైందని, తమకు సేవచేసే అభ్యర్థి, తమ కోసం పనిచేసే అభ్యర్థి ఎవరో తెలుసుకుని ఓటు వేయాలన్నారు. పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలను తాము సేకరించామని, ఈ వివరాలు రిటర్నింగ్ అధికారుల వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. నోటీసు బోర్డులపై కూడా ఈ వివరాలను ఉంచామని చెప్పారు. ఎవరు ఎలాంటి వ్యక్తో దీని ద్వారా తెలుస్తుందని వివరించారు. ఒక్కో వార్డులో ఓటర్ల సంఖ్య సరాసరిన 1,700 నుండి 1,800 మధ్య ఉందని, అందువల్ల గెలుపు కేవలం కొద్ది ఓట్ల తేడాలోనే ఉంటుందని ఆయన చెప్పారు. ఈ కారణంగానే ప్రతి ఓటరు తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఓటు హక్కు కలిగినవారు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన సమయంలో వారి ఓటు ఎవరైనా వేసి ఉంటే ‘టెండర్ ఓటు’ వేయాలని, అలా టెండర్ ఓటు
వేసినట్లైతే ఆ కేంద్రంలో అక్రమాలు జరిగినట్టు రుజువుతుందని, దాంతో రీ-పోల్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ శాతం పెరగాల్సి ఉందని, ప్రతి ఓటరు తమ ఓటుహక్కు వినియోగించుకుంటే ఇది సాధ్యమన్నారు. బుధవారం ఏవైనా పనులు ఉంటే ఉదయమే పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటు వేసి వెళ్లాలని ఆయన సూచించారు. బుధవారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుండడం వల్ల క్యూలైన్లు తక్కువగా ఉంటాయని, ఓటర్లు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పనిలేదన్నారు.
భైంసాలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేశామని నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు ఏర్పాట్లు చేశామని, రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజలు ఎన్నికల కమిషన్‌కు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
'చిత్రం...మున్సిపల్ ఎన్నికల పోలింగ్‌పై మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి