తెలంగాణ

మేడారం జాతరపై ప్రభుత్వానికి పట్టింపు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడ్వాయి, జనవరి 21: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరపై ప్రభుత్వానికి పట్టింపు లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం ఆయన మేడారం సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ, బెల్లం, చీర, సారె సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మందకృష్ణమాదిగ మాట్లాడుతూ ఆసియాఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరకు ప్రభుత్వం కేవలం 75 కోట్ల నిధులు కేటాయించడం దారుణమని, ఈ నిధులతో ఏమాత్రం శాశ్వత అభివృద్ధి పనులు జరగడం లేదన్నారు. ప్రభుత్వం వంద కోట్లు కేటాయిస్తుందని మంత్రులు, ఎమ్మెల్యే గొప్పలుచెప్పుకున్నప్పటికీ ఆచరణలో చూపించలేదని అన్నారు. తెలంగాణలో కుంభమేళా తరహాలో జరిగే మేడారం జాతరపై ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చే ముఖ్యమంత్రి వంద కోట్లు కేటాయించి దర్శనానికి రావాలని ఆయన డిమాండ్ చేశారు. ములుగు జిల్లా పూర్తిగా అభివృద్ధిలో వెనుకబడి ఉందని, ఈ జిల్లాకు ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. యాదాద్రి తరహాలో మేడారం ఆలయానికి 200 కోట్లు కేటాయించి అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ గత జాతరలో అమ్మవార్ల దర్శనానికి వచ్చినప్పుడు హామీ ఇచ్చారని, ఇప్పటివరకు ఆ హామీని నెరవేర్చకపోవడం ఆయన నియంతృత్వ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు వట్టం ఉపేందర్, జిల్లా అధ్యక్షుడు కబ్బాక శ్రావణ్‌కుమార్, రాష్ట్ర నాయకులు రామనేని సురేందర్, నాయకపోడు అధ్యక్షుడు డబ్బ సాగర్, గజ్జెల ప్రసాద్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

'చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న మంద కృష్ణమాదిగ