తెలంగాణ

రాజకీయ లబ్ధి కాదు... ప్రజా ప్రయోజనాలే ముఖ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటిక్యాల, జూలై 20: కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని గద్వాల జిల్లా ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే డికె అరుణ, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో గద్వాలను జిల్లాగా ఏర్పాటు చేయాలని మంగళవారం చేపట్టిన పాదయాత్ర రెండవ రోజు ఎర్రవల్లి చౌరస్తాలో ప్రారంభమై బోరవెల్లి వరకు కొనసాగింది. పాదయాత్రలో విద్యార్థులు, మహిళలు, ప్రజాసంఘాల నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గద్వాల జిల్లా సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయబోమన్నారు. జోగులాంబదేవి పేరుమీద గద్వాల జిల్లాను ఏర్పాటు చేస్తే గద్వాల జములమ్మ, అలంపూర్ జోగులాంబదేవి ఆశీస్సులతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.
గురువారం బొరవెల్లిలో ప్రారంభమై బూడిదపాడు వరకు కొనసాగించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాల మున్సిపల్ చైర్‌పర్సన్ బండల పద్మావతి, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు రామిరెడ్డి, రాముడు, పరమేశ్వర్‌రెడ్డితో పాటు కార్యకర్తలు, ప్రజలు ఉన్నారు.

గొర్రెల పెంపకందారులకు
పావలావడ్డీ వర్తింపు
రూ.98 కోట్లు కేటాయిస్తూ జీఓ జారీ

హైదరాబాద్, జూలై 20: రాష్ట్రంలోని గొర్రెలు, మేకల పెంపకందారులకు పావలావడ్డీ పథకాన్ని వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకంతో దీన్ని అమల్లోకి తీసుకువస్తున్నారు. గొర్రెలు, మేకల పెంపకందారులకు మొదటి దశలో మహబూబ్‌నగర్ జిల్లాలో 13.09 కోట్లు, రెండోవిడతలో 24.90 కోట్లను ఇస్తోంది. దాదాపు ఐదువేల మందికి ఈ మొత్తాన్ని జాతీయ సహకార అభివృద్ధి కార్పోరేషన్ (ఎన్‌సిడిసి) రుణంగా ఇస్తున్నారు. ఎన్‌సిడిసి 60 శాతం నిధులను, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం మొత్తాన్ని రుణంగా సమకూరుస్తుండగా మిగతా 20 శాతం వాటాను లబ్ధిదారులు భరించాల్సి ఉంటుంది. మహబూబ్‌నగర్‌తో పాటు మిగిలిన ఎనిమిది జిల్లాల్లో (హైదరాబాద్ మినహా) కూడా ఎన్‌సిడిసి 234.48 కోట్లను విడుదల చేస్తోంది. ఎన్‌సిడిసి 11.75 శాతాన్ని వడ్డీగా వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ కారణంగానే రైతులకు వర్తింపచేస్తున్న విధంగానే పావలా వడ్డీ పథకాన్ని గొర్రెలు, మేకల పెంపకందార్లకు వర్తింపచేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకు అనుగుణంగా 75 శాతం వడ్డీకింద 98.03 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని పశుసంవర్థక శాఖ లెక్కలు వేశారు. ప్రభుత్వం ఈ మేరకు నిధులను విడుదల చేసేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది.