తెలంగాణ

నేటి నుంచి నాగోబా జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జనవరి 23: ఆదివాసీల ఆరాధ్య దైవంగా కొలిచే కెస్లాపూర్ నాగోబా జాతర శుక్రవారం ప్రారంభం కానుంది. ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దంగా, మేడారం సమ్మక్కసారక్క జాతర తర్వాత రెండో అతిపెద్ద ఆదివాసీ జాతరగా గుర్తింపు పొందిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కెస్లాపూర్‌లోని నాగోబా దేవతను దర్శించుకునేందుకు చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర తెలంగాణ జిల్లాలకు చెంది న భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. ఏడాదికోసారి కెస్లాపూర్‌లో ఆత్మీయంగా కలుసుకొని జా తర ఉత్సవాలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించడం మెస్రం వంశస్థుల ఆచారంగా కొనసాగు తూ వస్తోంది. పుష్యమాస అమావాస్యను పురస్కరించుకొని రాత్రి 9 గంటలకు సంప్రదాయ బద్ధంగా ఆదివాసీలు మహాపూజ క్రతువును ప్రారంభించనున్నారు. మెస్రం వం శస్తులు ఆలయ ప్రవేశానికి ముం దు జన్నారం మండలం కలమడు గు నుండి పాదయాత్రగా సేకరించి న పవిత్ర గోదావరి జలాలతో నా గోబా ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. బుధవారం రాత్రి తమ ఆ చార వ్యవహారాలకు అనుగుణంగా కీర్తిశేషులైన పెద్దలను స్మరిస్తూ తూమ్ (కర్మకాండ) పూజలు నిర్వహించారు. జాతర ఉత్సవాల ప్రారంభం
సందర్భంగా శుక్రవారం ఉదయం మెస్రం వంశస్థులు మర్రిచెట్టు నుండి ఆలయ ప్రవేశం చేయనున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ఆదివాసీ గిరిజనులు గుడారాలు వేసుకొని కెస్లాపూర్‌లో తమ ప్రత్యేక పూజల్లో నిమగ్నమయ్యారు. మట్టి కుండలతో ఆడపడుచులు నీళ్లు తెచ్చి పుట్టలు ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం మహాపూజ క్రతువు జరిగిన అనంతరమే జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయితే, ప్రభుత్వం రూ.10 లక్షలు జాతర ఉత్సవాలకు మంజూరు చేస్తున్నట్ట్లు ప్రకటించి ఆరు నెలలు గడిచినా ఇంతవరకు నిధులు రాకపోవడంతో గిరిజన పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గర్భగుడి నిర్మాణం తప్ప అసంపూర్తిగానే అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఎంపీ సోయం బాపురావు తన ఎంపీ ల్యాడ్స్ నిధుల నుండి సెంట్రల్ లైటింగ్ కోసం రూ.15 లక్షలు మంజూరు చేయగా వీధి దీపాల వెలుగులతో జాతర కొత్త రూపును సంతరించుకుంది. జిల్లా యంత్రాంగం మొక్కుబడి ఏర్పాట్లు చేయడం పట్ల ఆదివాసీ పెద్దలు పెదవి విరుస్తున్నారు. జాతర ఉత్సవాల్లో భాగంగా ఈనెల 24న రాత్రి 10 గంటలకు మహాపూజ, ఆ తర్వాత సతిక్ పూజ, 25న పెర్సపేన్ పూజలు, 26న బాన్క్‌దేవత పూజ, 27న గిరిజన దర్బార్, 28 మాండ్‌గాజ్‌లింగ్ పూజలు ఉంటాయి.

'చిత్రం...కెస్లాపూర్‌లోని నాగోబా మూలవిరాట్