తెలంగాణ

కోరం లేక నేరేడుచర్ల, మేడ్చల్ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రెండు మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నిక సోమవారం జరగాల్సి ఉండగా మంగళవారానికి వాయిదాపడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగగా, 118 మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికలు సోమవారం జరిగాయి. రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీ, సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపల్ చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికలు జరగలేదు. మంగళవారం ఈ రెండుచోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతించింది.
మేడ్చల్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికను కోరం లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు అధికారులు ఏర్పాట్లు చేసి కౌన్సిలర్ల రాక కోసం ఎదురుచూశారు. మేడ్చల్ మున్సిపల్‌లో 23 మంది కౌన్సిలర్లు ఉండగా 14 టీఆర్‌ఎస్, నాలుగురు కాంగ్రెస్, నలుగురు స్వతంత్రులు, ఒకరు బీజేపీ నుంచి గెలిచారు. టీఆర్‌ఎస్‌కు మె జారిటీ ఉన్నప్పటికీ ఈ పార్టీ కౌన్సిలర్లు క్యాంపు నుండి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నిర్ణీత సమయానికి రాలేదు. తొలుత బీజేపీ కౌన్సిలర్ మాత్రమే రాగా తర్వాత స్వతంత్ర కౌన్సిలర్లు, కాంగ్రెస్ కౌన్సిలర్లు వచ్చారు. సమావేశం జరగాల్సిన నిర్ణీత సమయానికి కోరం లేకపోవడంతో చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ల ఎన్నికను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
అలాగే సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల చైర్‌పర్సన్, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నిక కూడా వాయిదాపడింది. 15 మంది కౌన్సిలర్లు ఉండే
ఈ మున్సిపాలిటీలో టీఆర్‌ఎస్‌కు ఏడు, కాంగ్రెస్‌కు ఏడు స్థానాలు లభించాయి. సీపీఎం ఒక స్థానంలో గెలవగా, కాంగ్రెస్‌కు సీపీఎం కౌన్సిలర్ మద్దతు ఇస్తున్నారు. టీఆర్‌ఎస్ నుండి ముగ్గురు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకోవడంతో వీరి సంఖ్య 10కి పెరిగింది. కాంగ్రెస్ పార్టీ నుండి కూడా ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నమోదయ్యారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో సహా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు పదేసి మంది మద్దతు ఉంటుంది. ఈ నేపథ్యంలో మంగళవారం చైర్‌పర్సన్, వైస్-చైర్‌పర్సన్ స్థానాలకు ఎన్నిక మంగళవారం జరుగనుంది.