తెలంగాణ

బస్తీమే సవాల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పంచాయతీ నుంచి పరిషత్ దాకా, పట్నం నుంచి పార్లమెంట్ దాకా, కౌన్సిల్ నుంచి అసెంబ్లీ దాకా ఎన్నికలేవైనా రాజకీయ ప్రత్యర్థి పార్టీలకు అధికార టీఆర్‌ఎస్ బస్తీమే సవాల్‌గా తన సత్తా చాటుకుంటోంది. మున్సిపల్ ఎన్నికల చరిత్రలో మునుపెన్నడూ పాలకపక్షం ఏకపక్షంగా విజయం సాధించిన ఉదంతాలు కనిపించవు. అయితే, ఇపుడు ఎన్నికల చరిత్రను తిరగరాసే విజయాన్ని మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సొంతం చేసుకుంది. రాష్టవ్య్రాప్తంగా 120 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో 112 పురపాలికలను, 10కి 10 నగరపాలక సంస్థలపై టీఆర్‌ఎస్ విజయకేతనం ఎగురవేసింది. ఇంతటి విజయాన్ని సొంతం చేసుకోవడానికేమైనా టీఆర్‌ఎస్ అధిష్టానం ఏమైనా కాలికి బలపం కట్టుకొని ఇల్లిలూ తిరిగిందా? అంటే అదీ లేదు. మరి ఎలా సాధ్యమైంది ఇంతటి అనితర విజయమంటే? దటీజ్ కేటీఆర్! అని చెప్పకతప్పదు. టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మున్సిపల్ ఎన్నికలను పూర్తిగా తన భుజాన వేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఒంటి చేత్తో గులాబీ సిగలో విశ్వనగరాన్ని పొదిగిన తన అనుభవాన్ని రంగరించారు. తన తండ్రి, పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నుంచి అబ్బిన దీక్షాదక్షతలు, చాణక్యనీతిని ఒంట బట్టించుకున్న కేటీఆర్ మున్సిపల్ ఎన్నికలను కూడా తన భుజస్కంధాలపై వేసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం ఆరు నెలల కిందటే మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే కోర్టు కేసుల కారణంగా వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చినప్పటికీ పార్టీని సర్వసన్నద్ధం చేసి ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా సంసిద్ధం చేశారు. పరీక్షల తేదీ ప్రకటించాక పాస్ కావడానికి కష్టపడినట్టుగా కాకుండా తరగతులు ప్రారంభమైన డే వన్ నుంచే విజయం సాధించడానికి సన్నద్ధమైన విద్యార్థిలాగా మున్సిపల్ ఎన్నికలకు కేటీఆర్ వ్యూహంతో ముందుకు వెళ్లడం వల్లనే ఈ అనితర సాధ్యమైన విజయానికి సోపానమైందనడంలో అతిశయోక్తి ఏ మాత్రం లేదు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత మరే పార్టీలో లేనంతగా టికెట్ల కోసం టీఆర్‌ఎస్‌లో పోటీ నెలకొంది. టికెట్ దక్కనివాళ్లు ఎక్కడికక్కడ నామినేషన్లు వేశారు. అయితే బీ-్ఫరం దాఖలు చేసే గడువులోగా తిరుగుబాటుదారులను దారికి తెచ్చుకోగలిగారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసేసరికి ఒకటి, రెండుచోట్ల తప్ప మిగతా చోట్లంతా సర్దుకుంది. పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా ఆ తర్వాత పార్టీలో చేరిన ఎమ్మెల్యేలున్నచోట పార్టీలో ముందునుంచి ఉన్నవారికి, కొత్తగా వచ్చిన చేరిన వారికి మధ్య మున్సిపల్ ఎన్నికలు చిచ్చురేపాయి. అలాంటి పరిస్థితి ఉన్నచోట మాజీ ఎమ్మెల్యేలు, తాజా ఎమ్మెల్యేలను కేటీఆర్ హైదరాబాద్‌కు పిలిపించి వారి మధ్య సయోధ్య కుదిరేలా చేయడంలో కృతకృత్యులయ్యారు. సమన్వయంతో ముందుకు వెళ్లేలా దిశానిర్దేశం చేశారు. అయినప్పటికీ కొన్నిచోట్ల పంచాయితీ తెగలేదు. తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లను రంగంలోకి దింపారు. కొల్లాపూర్, తాండూర్‌కు వీరిని స్వయంగా పంపించి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించారు. మిగతా అన్నిచోట్లా పరిస్ధితి దారికొచ్చి నేతలంతా ప్రచారంలో
దూసుకుపోయాకే ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీటింగ్‌కు కేటీఆర్ నిశ్చింతగా వెళ్లి వచ్చారు. ఫలితాల వెల్లడి తర్వాత పార్టీకి అవసరమైనచోట ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లను వినియోగించుకోవడంలో కేటీఆర్ పన్నిన వ్యూహం నూటికి నూరుపాళ్లు ఫలించింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాను గానీ, పార్టీ అధినేత గానీ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండానే కేటీఆర్ పన్నిన వ్యూహరచన ఫలించి అసాధారణ విజయాన్ని మరోసారి అందించి పార్టీ అధినేత కేసీఆర్‌తో భేష్ అనిపించుకోగలిగారు.

*చిత్రం... కేటీఆర్