తెలంగాణ

కరోనా.. భయమొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: తెలంగాణలో కరోనా వైరస్ ఉన్నట్టు ఇంకా నిర్ధారణ కాలేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ కరోనా వైరస్ సోకుతోందంటూ వస్తున్న వదంతులు నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌కు సం బంధించి వైద్య ఆరోగ్య శాఖ అన్ని కోణాల్లో పరిశీలిస్తోందన్నారు. కరో నా వైరస్‌పై బుధవారం అధికారులతో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సమావేశం తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.
ఇదిలావుండగా, కరోనా వైరస్‌కు సంబంధించి దవాఖానాల్లో తీసుకు న్న చర్యలను పరిశీలించేందుకు కేం ద్రం నుండి ఉన్నతాధికారులతో కూ డిన బృందం వచ్చింది. ఈ అధికార బృందం హైదరాబాద్‌లోని వివిధ దవాఖానాలను వెళ్లి పరిశీలిస్తోంది. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, ఛాతీ వ్యాధుల దవాఖానాలను ఈ బృం దం పరిశీలించింది. ఆయా దవాఖానాల సూపరింటెండెంట్లు, వైద్య శాఖ ఉన్నతాధికారులతో చర్చించింది.
ఇలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో గాంధీ ఆసుపత్రి, చెస్ట్ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్‌లో ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ వ్యాధి లక్షణాలతో వస్తున్న రోగులను పరీక్షిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. కరోనా వ్యాధి లక్షణాలతో వస్తున్న వారి నుండి శాంపిళ్లు సేకరించి పుణెలోని వైరల్ పరీక్షా కేంద్రానికి పంపిస్తున్నారు. ఫీవర్ హాస్పిటల్ నుండి పలువురు
రోగుల నుండి సేకరించిన శాంపిళ్లను పుణెకు పంపించగా, ‘కరోనా నెగెటివ్’ అని వచ్చింది. దాంతో వైద్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
గతంలో స్వైన్ ఫ్లూ వ్యాధి కూడా రాష్ట్ర ప్రజలను వణికించింది. స్వైన్ ఫ్లూ విజృంభిస్తోందని, గమనించిన ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్న సంగతి ఈ సందర్భంగా గమనార్హం. విదేశాల నుండి వచ్చేవారిని విమానాశ్రయాల్లోనే పరీక్షించి, స్వైన్‌ఫ్లూ ఉన్నట్టు అనుమానం కలగగానే సంబంధిత రోగులను దవాఖానాలకు పంపించి చికిత్స అందించారు. ఇప్పుడు కూడా కరోనా వైరస్‌పై అప్రమత్తమైన ప్రభుత్వం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశాల నుండి వచ్చి దిగుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తోంది.

*చిత్రాలు.. హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రిని మంగళవారం సందర్శించిన సందర్భంగా
మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర వైద్య నిపుణుల బృందం
*కరోనా వైరస్ సోకిన వారి కోసం గాంధీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డు
*మాట్లాడుతున్న రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్