తెలంగాణ

కేంద్రం వివక్షను ఎండగట్టాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: రాష్ట్ర ప్రయోజనాలే ప్రాతిపదికగా పార్లమెంట్ సమావేశాల్లో గళమెత్తాలని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిల పట్ల కేంద్రం అనుసరిస్తున్న వివక్షపై పార్లమెంట్‌లో ఎండగట్టాలని నిర్ణయించింది. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు దిశా నిర్దేశం చేశారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం టీఆర్‌ఎస్ పార్లమెంటరీ సమావేశం కేటీఆర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన జీఎస్టీ, ఐజీఎస్టీ బకాయిలు, విభజన చట్టం హామీల పట్ల నిర్లక్ష్యం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలను నీతి ఆయోగ్ ప్రశంసించడంతోపాటు ఆర్థిక సహాయం చేయాలని సిఫారసు చేసినప్పటికీ కేంద్రం స్పందించకపోవడాన్ని
ఎండగట్టాలని కేటీఆర్ తమ పార్టీ ఎంపీలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలు, పథకాలను కేంద్రం స్ఫూర్తిగా తీసుకొని వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రైతుబంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టు, హరితహారం తదితర పథకాలను పార్లమెంట్‌లో ప్రస్తావించాలని ఆయన సూచించారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టినా కేంద్రం నయాపైసా సహాయం చేయకపోవడంపై నిలదీయాలని కేటీఆర్ పేర్కొన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించాల్సిన నిధులు, దీర్ఘకాలిక డిమాండ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, రక్షణ శాఖ భూముల కేటాయింపు పట్ల కేంద్రం అనునసరిస్తున్న వైఖరిని ఎండగట్టాలన్నారు. ఆర్థిక మాంద్యంతో దేశం సంక్లిష్ట పరిస్థితి ఎదుర్కొంటుండగా ప్రజలకు ఏ మాత్రం అవసరం లేని పౌరసత్వ చట్ట సవరణ, ఎన్‌ఆర్‌సీ వంటి రాజకీయపరమైన అంశాలను పక్కన పెట్టాలని పార్లమెంట్‌లో డిమాండ్ చేయాలన్నారు. ఆర్థిక మాంద్యం ప్రభావం వల్ల రాష్ట్రంపై పడుతున్న భారాన్ని తగ్గించడానికి ఎలాంటి చర్యలు చేపడుతుందో లేవనెత్తాలని కేటీఆర్ సూచించారు.
ఇలాఉండగా మున్సిపల్ పాలక వర్గాల్లో బడుగు, బలహీన వర్గాలతో పాటు మైనార్టీలకు చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా సామాజిక న్యాయాన్ని కల్పించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసినట్టు టీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు మీడియాకు వివరించారు. పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయా వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారని కేకే తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఘన విజయానికి సీఎం కేసీఆర్ పరిపాలన, ప్రజా సంక్షేమం వల్లనే సాధ్యమైందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయానికి వ్యూహరచన చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కే దక్కుతుందన్నారు. లోక్‌సభలో పార్టీ నాయకుడు నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల చరిత్రలో ఎక్కడా వందకు శాతం కార్పొరేషన్లను 98 శాతం మున్సిపాలిటీలను గెలుచుకోలేదని అన్నారు. ఈ అనితర సాధ్యమైన విజయానికి సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కృషినే కారణమన్నారు.

*చిత్రం... ప్రగతిభవన్‌లో మంగళవారం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్