తెలంగాణ

ఎప్పుడైనా సామాజిక న్యాయం పాటించారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ పాలక వర్గాల్లో గతంలో ఎప్పుడైనా సామాజిక న్యాయాన్ని పాటించారా? అని మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, వీ శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్, బీజేపీ నేతలను ప్రశ్నించారు. రాజకీయంగా ఇంతవరకు గుర్తింపు లభించని వర్గాలకు కూడా
మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పదవులు ఇచ్చారని అన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో పస లేదన్నారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం మంత్రులు తలసాని, శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీజేపీ అనైతికంగా పొత్తు పెట్టుకోవడాన్ని ప్రజలు తిరస్కరించారన్నారు. నేరుడుచర్లలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డ్రామా ఆడారని వారు దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ రాష్టవ్య్రాప్తంగా చిత్తుగా ఓడిపోయినా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎక్స్ అఫీషియోలకు ఓటు హక్కు కల్పించడంపై కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని, అసలు దీనిని తెచ్చిందే ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడన్న విషయం ఒక్కసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని వారు హితవు పలికారు. టీఆర్‌ఎస్ పార్టీ ఏది చేసినా నిబంధనల ప్రకారమే చేస్తుందన్నారు. జాతీయ స్థాయిలో విమర్శించుకునే కాంగ్రెస్, బీజేపీ ఇపుడు మున్సిపల్ పీఠాల్లో నిస్సిగ్గుగా పొత్తు పెట్టుకున్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ విమర్శించారు. దాదాపు వెయ్యి సీట్లలో ఈ రెండు పార్టీలు పొత్తులతో పోటీ చేశాయని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీని ఎదుర్కొనే సత్తాలేక జాతీయ పార్టీలుగా చెప్పుకునే కాంగ్రెస్, బీజేపీ నీచ రాజకీయాలకు ఒడిగట్టాయని దుయ్యబట్టారు. బడుగు, బలహీన వర్గాల పాలిట సీఎం కేసీఆర్ అభినవ జ్యోతిరావు పూలేగా శ్రీనివాస్‌గౌడ్ అభివర్ణించారు. తెలంగాణను దోచుకున్న కేవీపీ రామచంద్రరావును ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఎక్స్ అఫీషియాగా ఎంపిక చేసుకున్నారని ఆయన మండిపడ్డారు.