తెలంగాణ

తెలంగాణ సమాజానికే అవమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 28: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ తీరు తెలంగాణ సమాజాన్ని అవమానించే విధంగా ఉన్నాయని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రజలు సిగ్గుపడే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎన్నికలు నిర్వహించారన్నారు. నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ కూటమికి 8, టీఆర్‌ఎస్‌కు 7 సీట్లు వచ్చాయన్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో పేర్లను తమ పార్టీ తగ్గిస్తుంటే, టీఆర్‌ఎస్ పెంచుకుంటోందన్నారు. ఎన్నికలు నిర్వహించే బదులు ఎన్నికల సంఘం, టీఆర్‌ఎస్ ఒక లిస్టు రాసుకుని వాళ్లే చైర్మన్లు, వైస్ చైర్మన్ల అభ్యర్థులను ప్రకటిస్తే సరిపోయి ఉండేదన్నారు. ఈ ఎన్నికల్లో మిషన్ భగీరథలో దోచిన డబ్బులు ఎన్నికల్లో పంచారన్నాలరు. వార్డు రిజర్వేషన్ల ప్రకటన, నామినేషన్లు దాఖలు చేసేందుకు మధ్య వ్యవధి ఉండాలన్నారు. హైకోర్టులో విచారణ ముగిసిన వెంటనే సాయంత్రం నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. తెలంగాణలో న్యాయ వ్యవస్థ గురించి తాను పార్లమెంటులో ప్రస్తావిస్తామన్నారు. ఈవిషయాన్ని రాష్టప్రతి, ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ఈ ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరు బాగాలేదన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం జరిగినట్లు గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరెడుచర్ల విషయంలో గంట గంటకు అధికారులకు ఫోన్ చేసి పేర్లు మార్చారన్నారు. 25వ తేదీన అర్థరాత్రి వరకు మాత్రమే ఎక్స్ అఫిషియోసభ్యులు నమోదుకు అవకాశం కల్పించారన్నారు. ఎన్నికల ప్రక్రియ మొదలై, ఇద్దరు సభ్యులు ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రెసైడింగ్ ఆఫీసర్ చేతిలో పేపర్లను లాక్కొని, మైక్‌ను విరగ్గొట్టారన్నారు. మరో ఓటును కూడా నమోదు చేశారు. మున్సిపల్ శాఖ ఉన్నతాధికారి శ్రీదేవికి, ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డికి ఫోన్ చేసినా పట్టించుకోలేదన్నారు. రాజ్యసభ విడుదల చేసిన బులిటెన్‌లో కేశవరావు ఆంధ్రాకు, కేవీపీ రామచంద్రరావు తెలంగాణకు కేటాయించినట్లు స్పష్టంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ కేశవరావు పట్టుకున్న అప్లికేషన్‌ను రాజ్యసభ సెక్రటేరియట్ తిరస్కరించినట్లు చెప్పారు. ఈ వయస్సులో కేశవరావు అబద్దాలు ఆడడం తగదన్నారు. రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ హైదరాబాద్‌ను నోడల్ జిల్లాగా ఎంపిక చేసుకున్నానని చెప్పారు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఇక్కడే ఓటు వేసినట్లు చెప్పారు. ఆ తర్వాత అన్ని ఎన్నికల్లో ఇక్కడే ఓటు వేశానన్నారు.
1980 నుంచి ఇంతవరకు హైదరాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నానన్నారు. పార్లమెంటు సభ్యునిగా తనకు హక్కు ఉన్నట్లు చెప్పారు. తన ఓటును ఎక్కడ ఉపయోగించుకోవాలో తన హక్కును ఎవరూ అడ్డుకోలేరన్నారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలు మీద ఓటు వేయలేదన్నారు. తెలంగాణ కాంగ్రెస? పార్టీ తన ఓటు హక్కు కోసం ఎన్నికల సంఘంతో మాట్లాడి ఓటును పునరుద్ధరించినట్లు చెప్పారు.