తెలంగాణ

ఇక ‘సహకార’ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 29: స్థానిక సంస్థలు మొదలుకొని పురపాలికల వరకు అన్నింటికీ ఎన్నికలు ముగియడంతో మిగిలిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు కూడా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మూడు, నాలుగు రోజుల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సంబంధిత అధికారులను బుధవారం ఆదేశించారు.
ఈ ఎన్నికల ప్రక్రియను 15 రోజుల్లో పూర్తిచేయాలని కూడా సీఎం ఆదేశించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఇదివరకే కాలపరిమితి ముగియడంతో పర్సన్ ఇన్‌చార్జీలను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. కాగా, పర్సన్ ఇన్‌చార్జీల పదవీకాలం కూడా ముగియనుండడంతో వెంటనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించి కొత్త పాలక మండళ్లను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
*చిత్రం... ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు