రాష్ట్రీయం

విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, జనవనరి 29: కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతినిధుల బృందం సికిందరాబాద్ గాంధీ ఆసుపత్రిని సందర్శించింది. ఎపిడామాలజిస్టు డా.అనిత వర్మ, రెస్పీరేటర్లు డా.అజయ్ చౌహాన్, బయాలజిస్టు డా.శుభ బృందానికి ఆసుపత్రి సుపరింటెండెంట్ డా.శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో వైద్యుల బృందం ఆహ్వానం పలికారు. ఏడో అంతస్తులో కరోనా అనుమానిత రోగులకు చికిత్సలు అందజేయడానికి ఏర్పాటు చేసిన ఐసోలేటెడ్ వార్డును ఈ బృందం సభ్యులు పరిశీలించారు. అనంతరం కరోనా వ్యాధి నిర్ధారణ రోగుల కోసం నాలుగవ అంతస్తులో ఏర్పాటు చేసిన మైక్రో ల్యాబ్, అందులోని యంత్రాలతో రెండు వార్డుల్లోని మొత్తం 9 పడకల పనితీరును సూపరింటెండెంట్ ఈ వైద్య బృందానికి వివరించారు. ఈ ప్రత్యేక బృందం కరోనా వార్డులతో పాటు స్వైన్ ఫ్లూ వార్డు, జనరల్ వార్డు, ల్యాబ్‌ను సందర్శించింది. అన్ని విభాగాలను క్షుణ్ణంగా తనిఖీలు చేసిన వైద్యుల బృందం అన్ని విభాగాల హెచ్‌ఓడీలు, వైద్యులు, అధికారులతో సమావేశమయ్యారు. కరోనా వ్యాధి అనుమానిత లక్షణాలతో వచ్చిన వారి పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి చికిత్సలు అందజేయాలన్న అంశంపై వైద్యులకు పలు సూచనలు చేశారు. ఇంకా ఎటువంటి పరికరాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలన్న విషయాలపై కూడా చర్చించారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి వైద్యులు సిద్ధంగా ఉండాలని సూచించారు. గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర వైద్యుల బృందం ఏర్పాట్లు పట్ల సంతృప్తివ్యక్తం చేసిందని తెలిపారు. ఇంకా కొన్ని సౌకర్యాలను సమకూర్చుకోవాలని సూచించారని తెలిపారు. వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బందిని పెంచాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు. వైద్యులు, నర్సులు, సిబ్బంది వ్యక్తిగత రక్షణ కోసం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పినట్లు తెలిపారు. కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ మార్గదర్శకాల మేరకు కరోనా అనుమానితుల రక్త నమూనాలను పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపిస్తామని, వారు మాత్రమే కరోనాను ధృవీకరిస్తారని తెలిపారు. ఇతర ఆసపత్రులుగానీ, వైద్య సంస్థలుగానీ కరోనాను నిర్ధారించే అవకాశం లేదని అన్నారు. తనిఖీలలో కాలేజీ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ ప్రొ.నాగమణి, గాంధీ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ జీ నర్సింహారావు ఆర్‌ఎంఓ జయకృష్ణ, డా. శేషాద్రి పాల్గొన్నారు.

*చిత్రం... గాంధీ ఆసుపత్రిలోని వార్డులను బుధవారం పరిశీలిస్తున్న కేంద్ర వైద్య బృందం ప్రతినిధులు