తెలంగాణ

మీ ఆశలు నెరవేరుస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జనవరి 5: ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలంతా ప్రత్యేక రాష్ట్రం వస్తే తమ బతుకులు బాగుపడతాయని ఆశించారని, ఇప్పుడు రాష్ట్ర ప్రజల ఆశలు, ఆకాంక్షల మేరకే ప్రభుత్వం ముందుకుపోతుందని సిఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా మంగళవారం నందనగార్డెన్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రజల అవసరాల మేరకు నిధులు ఖర్చుచేయాలనే ఉద్దేశంతోనే కొత్త పంథాలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించారు. 15 శాతం సుస్థిరమైన ఆర్థిక వృద్ధితో తెలంగాణ రాష్ట్రం ముందడుగు వేస్తుందన్నారు. దానికి అనుగుణంగా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసుకుంటూ ముందుకు పోవాలన్నారు. రాష్ట్రంలో రెండో పెద్ద నగరమైన వరంగల్‌న గరంతో పాటు చారిత్రక ప్రాముఖ్యం కలిగిన వరంగల్ జిల్లా సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి ప్రభుత్వ సంకల్పంను నెరవేర్చాలని కోరారు. వరంగల్ నగరానికి టెక్స్‌టైల్ పార్కు వస్తుందని, హెల్త్‌యూనివర్సిటీ ఇప్పటికే వచ్చిందని, డిపిఎస్, హెచ్‌డిఎస్ లాంటి విద్యాసంస్థలు వస్తున్నాయన్నారు. ట్రైబల్ యూనివర్సిటీ కూడా వరంగల్‌లోనే స్థాపించాలనే డిమాండ్ ఉందన్నారు. వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని, బడ్జెట్‌లో ప్రతియేటా వరంగల్‌కు 300కోట్లు కేటాయిస్తామన్నారు. కేంద్రం కూడా స్మార్ట్‌సిటీ, అమృత్‌సిటీ కింద వరంగల్‌ను ఎంపిక చేసిందన్నారు. వరంగల్ కోట కాకతీయులు నిర్మించిన చెరువులు పర్యాటక రంగం అభివృద్దికి దోహదపడతాయన్నారు. త్వరలోనే వరంగల్ ఔటర్‌రింగ్‌రోడ్ నిర్మిస్తామని చెప్పారు. ప్రాజెక్టుల రీడిజైన్‌లో వరంగల్‌కు ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. మిడ్‌మానేరుకు ఎల్లంపెల్లి నుంచి నీరు వస్తుందని, దీని వల్ల వరంగల్‌కే ఎక్కువ మేలు జరుగుతుందన్నారు. మిషన్ భగిరథ ద్వారా వరంగల్ జిల్లాలో ప్రతి ఇంటికి నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాలో జరుగుతున్న మిషన్ భగిరథ పనులను ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలి విడత పది అసెంబ్లీ నియోజకవర్గాలకు మంచినీరు అందించాలని నిర్ణయించామన్నారు. జిల్లాలో జనగామ, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాలతో పాటు మెదక్ జిల్లా గజ్వేల్, సిద్దిపేట, దుబ్బాక, నల్గొండ జిల్లా ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాలకు నాలుగు నెలల్లోనే మంచినీరు ఇవ్వాలన్నారు. పైపులైన్ల ఏర్పాటుతో పాటు పనులు సమాంతరంగా జరగాలని ఆదేశించారు. మిషన్ కాకతీయలో మొదటి విడతలో చేపట్టిన 1062 చెరువుల పునరుద్ధరణ పనులను రెండో విడతలో చేపట్టే పనులను సిఎం సమీక్షించారు. నాణ్యత విషయంలో రాజీపడకుండా పనులు చేయాలని ఆదేశించారు. గత ఏడాది చేపట్టిన పనులను మార్చినాటికి పూర్తి చేయాలని, ఆ తరువాత వెంటనే రెండో విడత కార్యక్రమం ప్రారంభించాలన్నారు. 8వేల క్యూసెక్కుల సామర్ధ్యం గల కాకతీయ కాలువల మరమ్మతులను సిఎం సమీక్షించారు. పూర్తిస్థాయి నీటి ప్రవాహ సామర్ధం ప్రకారం నీరు ప్రవహించేలా కాలువలు సిద్ధం చేయాలన్నారు. మెయిన్ కాలువలతో పాటు ప్రాజెక్టులు ఉప యుక్తమైన ప్రాజెక్టులుగా మార్చాలన్నారు. దేవాదుల కింద కట్టాల్సిన రిజర్వాయర్లకు అవసరమైన భూసేకరణ జరపాలన్నారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ దాదాపు పూర్తయిందని, కాళేశ్వరం ప్రాజెక్టులపై త్వరలోనే మహారాష్టత్రో ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. వీటిపై అవగాహన కల్పించేందుకు త్వరలోనే ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేయనున్నామన్నారు. తులారాం ప్రాజెక్టు, గౌరారం ప్రాజెక్టులను మరింత ఉపయుక్తకంగా మార్చాలని, జంపన్నవాగుపై, ఆకేరు వాగుపై చెక్‌డ్యాం నిర్మించాలని అన్నారు. భూనిర్వాసితులకు మేలు జరిగే విధంగా భూకొనుగోలు విధానాలు తెచ్చినందున దానిని సద్వినియోగం చేసుకొని ప్రాజెక్టుల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఈ సమీక్షలో సిఎం ముఖ్యకార్యదర్శి స్మితాసబర్వాల్, జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, అన్ని శాఖల అధికారులు, మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

చిత్రం... వరంగల్ సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్