తెలంగాణ

రిజర్వేషన్ల ఎత్తివేతకు బీజేపీ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభు త్వం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రిజర్వేషన్లను ఎత్తివేయడానికి బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి ఆర్‌సి కుంతియా ఆరోపించారు. 72 ఏళ్లుగా రిజర్వేషన్లు పొందుతున్న వర్గాలు నష్టపోయే ప్రమాదం ఏర్పడిందని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నా రు. రిజర్వేషన్లను కాపాడుకునేందుకు మండల స్థాయి నుంచి రాష్టస్థ్రాయి వరకు ఆందోళన కార్య క్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు కుంతి యా సూచించారు. టీపీసీసీ అధ్వర్యంలో ఈనెల 16న హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లపై బీజేపీ ప్రభుత్వం వెనక్కి తగ్గే వరకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో మండల, ని యోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఆందోళనలను ఉ ధృతం చేయాలన్నారు. దేశంలో నిరక్షరాస్యత, పే దరికం, సామాజిక వెనుకబాటు తనాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, ఉద్యోగ, పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించిందన్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం కొంతకాలంగా రిజర్వేషన్లను ఎత్తి వేసేందుకు ఒక పథకం ప్రకారం కు ట్రలు పన్నుతుందని కుంతియా ఆరోపించారు. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గతంలో రిజర్వేషన్లను పునర్ సమీక్షించాలని ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఈ ప్రకటన చేసినప్పటి నుంచే రిజర్వేషన్లను ఎత్తివేస్తారన్న అనుమానాలు నెలకొన్నాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని ఆచరించే క్రమంలో బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేయడానికి అవకాశం కోసం ఎదురు చూస్తోందని ఆరోపించారు. ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ, పదోన్నతుల విషయంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. అలాగే, రిజర్వేషన్ల అమలు రాష్ట్రాలకే పరిమితం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. రిజర్వేషన్లపై సుప్రీంఇచ్చిన తీర్పు విషయంలో కేంద్రం రివ్యూ పిటిష న్ వేయకుండా వీటిని తొలగించడానికి మార్గాలు వెతుకుతుందని కుంతియా ఆరోపించారు. బడు గు, బలహీన వర్గాలకు తీవ్ర అన్యాయం చేసే కుట్రను తిప్పికొట్టడానికి ప్రజలతో కలిసి కాంగ్రెస్ ఆందోళన బాట పడుతుందని అన్నారు.