తెలంగాణ

బంగారు తెలంగాణలో భాగస్వాములు కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, ఫిబ్రవరి 13: బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్‌లోని ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకొని బస చేయగా, గురువారం ఉదయం వీఐపీలు, అధికారులు, కార్పొరేటర్లు సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు ఉత్తర తెలంగాణ భవన్‌కు వచ్చి పుష్పగుచ్ఛాలు అందించారు. ముఖ్యమంత్రి కళ్ళలో పడేందుకు నాయకులంతా ప్రయత్నించడంతో వారిని అడ్డుకునేందుకు ఓ మంత్రి యత్నించగా వాళ్ళను కలువనివ్వరా..? అని సీఎం ప్రశ్నించడంతో ఆయన కంగు తిన్నారు. మూడోసారి జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లాలోని అన్నిప్రభుత్వ విభాగాల అధికారులు, వీఐపీలు, నూతనంగా గెలుపొందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే అధికార పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈసందర్భంగా సీఎం కేసీఆర్ వారితో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంక్షేమాన్ని కాంక్షిస్తూ అధికార యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు, నూతనంగా గెలుపొందిన ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసికట్టుగా అభివృద్ధి పనులు పూర్తి చేసి బంగారు తెలంగాణ సాధనలో తమవంతు భాగస్వామ్యం ఉండాలని ఆకాక్షించారు. అనంతరం పేరుపేరునా అధికారులను, ప్రజాప్రతినిధులను పలకరిస్తూ ఆలింగనం చేసుకున్నారు. గత జ్ఞాపకాలు వారితో పంచుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు నేరుగా తనకు ఇవ్వాలని సూచించారు. అనుకోని ఆప్యాయతకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉబ్బితబ్బిబ్బయ్యారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో మంత్రులు గంగుల కమలాకర్, ఈటల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, తెరాస పార్టీ నాయకులు, కార్యకర్తలు, జిల్లా కలెక్టర్ కొండూరు శశాంక, ఇన్‌చార్జి నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

*చిత్రం... హెలికాప్టర్ నుంచి కిందకు దిగుతూ ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం