తెలంగాణ

10 రోజులు పట్టణ ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 16: రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ఈ నెల 24 నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి విధి విధానాలు ఖరారు చేయడానికి మంగళవారం ప్రగతిభవన్‌లో రాష్టస్థ్రాయి మున్సిపల్ సదస్సు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ సదస్సుకు మున్సిపల్ మేయర్లు, చైర్ పర్సన్లు, కమిషనర్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎమ్మెల్యేలను ఆహ్వానిస్తారు. పౌరసత్వ చట్ట సవరణ చట్టాన్ని (సీఏఏ) రద్దు చేయాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రిమండలి మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల తరహాలో ఈ మేరకు శాసనసభలో తీర్మానం చేయాలని కూడా మంత్రిమండలి నిర్ణయించింది. ఇలాఉండగా చక్కని నగర జీవన వ్యవస్థపై పయనం సాగటమే లక్ష్యంగా పట్టణ ప్రగతి కార్యక్రమానికి పునాది ఏర్పడాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. పౌరులనకు మెరుగైన సేవలు అందాలని, ప్రజలకు విస్తృతమైన భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మున్సిపల్ సదస్సు జరిగే అదేరోజు మధ్యాహ్నం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి తీసుకెళ్లాలని సమావేశం నిర్ణయించింది. అక్కడ ఏర్పాటు చేసిన వెజ్, నాన్‌వెజ్ మార్కెట్లను, శ్మశాన వాటికలను వీరికి చూపిస్తారు. జీహెచ్‌ఎంసీకి ప్రతినెలా రూ.78 కోట్లు, ఇతర నగరాలకు రూ.70 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక సంఘాన్ని కోరింది. 14వ ఆర్థిక సంఘం ద్వారా రావాల్సిన రూ.811 కోట్లలో రూ.500 కోట్లు మున్సిపాలిటీలకు, కార్పొరేషన్లకు, రూ.148 కోట్లు జీహెచ్‌ఎంసీకి కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయించింది. పట్టణాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి ఆధునిక పద్ధతులు అవలంభించాలి. రాజీవ్ స్వగృహ, అభయహస్తం, బంగారుతల్లి, వడ్డీలేని రుణం తదితర పథకాలపై క్షణ్ణంగా అధ్యయనం చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. రాజీవ్ స్వగృహ ఇళ్లను వేలం వేయాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన విధివిధానాల ఖరారుకు సీనియర్ ఐఏఎస్ అధికారిణి చిత్రా రామచంద్రన్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేస్తూ సభ్యులుగా ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ను నియమించింది. అభయహస్తం పథకాన్ని సమీక్షించే బాధ్యతను మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్
అధికారి సందీప్ సుల్తానియాకు అప్పగించింది. తెలంగాణ లోకాయుక్త చట్టంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బడ్జెట్ సమావేశాల్లో లోకాయుక్త బిల్లు ప్రవేశ పెట్టాలని మంత్రి మండలి నిర్ణయించింది. మేడారం సమ్మక్క-సారాలమ్మ జాతర ఘనంగా నిర్వహించడం పట్ల ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులతో పాటు మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, కేటీఆర్, డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మంత్రిమండలి అభినందించింది.

*చిత్రం... ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు