తెలంగాణ

నల్గొండలో 89 సంఘాల్లో చైర్మన్ పీఠాలు టీఆర్‌ఎస్ కైవసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఫిబ్రవరి 16: సహకార సంఘాల చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల ఎన్నిక ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఆదివారం ప్రశాంతంగా కొనసాగింది. 109 సంఘాలకు 102 సంఘాల్లో చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 89 సంఘాల చైర్మన్ పీఠాల్లో టీఆర్‌ఎస్ పార్టీ గులాబీ జెండా ఎగరేయగా, 11 సంఘాల చైర్మన్ పదవులు కాంగ్రెస్ హస్తగతమయ్యాయి. కాంగ్రెస్ మద్దతుతో సీపీఎం, టీడీపీలు మూడు చైర్మన్ పదవులు సాధించాయి. గొల్లగూడెం, రాయినిగూడెం, నిడమనూర్, గుజ్జ, మఠంపల్లి, శివన్నగూడెం, గుండాల సహకార సంఘాల ఎన్నికలు కోరం లేని కారణంగా సోమవారానికి వాయిదా పడ్డాయి. సాగర్ నియోజకవర్గంలో కొత్తపల్లి సహకార సంఘం చైర్మన్ పదవిని ఆశించి డీసీసీబీ చైర్మన్ అయ్యేందుకు ప్రయత్నించిన ఆప్కాబ్ మాజీ చైర్మన్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డికి టీఆర్‌ఎస్ వర్గపోరు షాక్‌నిచ్చింది. ఆయనను చైర్మన్ కాకుండా అడ్డుకునేందుకు వ్యతిరేక వర్గం ఐదుగురు కాంగ్రెస్ చైర్మన్ రెక్కల మధుసూదన్‌రెడ్డికి మద్దతునిచ్చారు. దీంతో రెక్కలకు పది, ఎడవెల్లికి ముగ్గురు మద్దతు మాత్రమే దక్కడంతో చైర్మన్ పదవి ఎడవెల్లికి దూరమైంది. మంత్రి జగదీష్‌రెడ్డి మద్దతుతో మూడోసారి డీసీసీబీ చైర్మన్ పదవి సాధించాలన్న ఎడవెల్లి ప్రయత్నాలకు గండిపడగా, పల్లా రాజేశ్వర్‌రెడ్డి మద్దతునిస్తున్న దేవరకొండ మండలం పడమటిపల్లి సొసైటీ చైర్మన్ పల్లా ప్రవీణ్‌రెడ్డికి డీసీసీబీ చైర్మన్‌గా ఎన్నికయ్యేందుకు మార్గం సుగమమైందని భావిస్తున్నారు.