తెలంగాణ

డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించే వరకూ ఉద్యమాలు నిర్వహిస్తామని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సోమవారం నాడు హెచ్చరించింది. ఈ మేరకు సంఘం ప్రధాన కార్యదర్శి టీ వెంకట్రాములు ఒక ప్రకటన విడుదల చేస్తూ అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కేంద్ర, రాష్ట్ర పాలకులు వ్యవసాయ కూలీలు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పేదలకు భూములు పంపిణీ చేయడంలో ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదని అన్నారు. 57 ఏళ్ల వారికి పెన్షన్ కాగితాలకే పరిమితం అయ్యిందని అన్నారు. ఉపాధి పనులకు నిధులు కోత పెట్టి కూలీల పొట్టగొడుతున్నారని అన్నారు. సంవత్సరంలో 200 రోజులు పనులు కల్పించి, రోజుకు 500 రూపాయిలు కూలీ సాధించటానికి నెలకు ఐదు వేల రూపాయిల పెన్షన్ , సంక్షేమ పథకాల సక్రమ అమలు , దళితులపై గిరిజనులపై, మహిళలపై దాడులను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు మార్చి 20న ఛలో ఢిల్లీ , జంతర్‌మంతర్ వద్ద మహాధర్నాకు బీజేయంయు పిలుపునిచ్చిందని అన్నారు,. రాష్ట్రం నుండి పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొనాలని అన్నారు.

మార్చి 15 నుండి ఏఐఎస్‌ఎఫ్ జాతీయ మహాసభలు
22న సీఐటీయూ ధర్నాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 17: అఖిల భారత యువజన సమాఖ్య - ఎఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలను హైదరాబాద్‌లో మార్చి 15 నుండి 18 వరకూ నిర్వహిస్తామని జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్ తిరుమలై రామన్ తెలిపారు. సోమవారం నాడు హిమాయత్‌నగర్‌లో మహాసభల వాల్‌పోస్టర్‌ను తిరుమలై ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రీ, ప్రధాన కార్యదర్శి మరుపాక అనిల్ కుమార్ , ఉపాధ్యక్షుడు ఎన్ శ్రీకాంత్, ఆర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమలై మాట్లాడుతూ ఈ మహా సభలకు 29 రాష్ట్రాల నుండి 950 మంది ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. దేశ విదేశాల నుండి కూడా ప్రతినిధులు ఈ సభల్లో పాల్గొంటారని చెప్పారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యల పట్ల భవిష్యత్ కార్యాచరణ ఈ సమావేశాల్లో రూపొందిస్తామని అన్నారు.
దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కరించాలంటే భగత్‌సింగ్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్టును తీసుకురావాలని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ, సామాజిక న్యాయం కోసం ఎఐవైఎఫ్ ఎడతెగని పోరాటాలు చేస్తోందని అన్నారు. ఇదిలావుండగా, పీఆర్‌సీ , కొత్త మున్సిపాల్టీల్లో వేతనాల పెంపునకు 22వ తేదీన మున్సిపల్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్టు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) అధ్యక్షుడు కమర్ అలీ, ప్రధానకార్యదర్శి పాలడుగు భాస్కర్‌లు తెలిపారు.

సీఏఏ అమలుపై సీఎం ద్వంద్వ వైఖరి
సీపీఐ, సీపీఎం నేతల ధ్వజం

హైదరాబాద్, ఫిబ్రవరి 17: పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలుచేసేది లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేసినా, మరో పక్క అధికారులు ఎన్‌పీఆర్ అమలుకు రంగం సిద్ధం చేస్తున్నారని, అంటే ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నట్టుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం వేర్వేరు ప్రకటనల్లో విమర్శించారు. పౌరసత్వ సవరణ చట్టం రద్దు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం తీర్మానించడం హర్షణీయమేనని, పౌరసత్వం విషయంలో మతపరమైన వివక్ష తగదని పేర్కొనడాన్ని తాము స్వాగతిస్తున్నామని అన్నారు. అలాగే శాసనసభలో కూడా సీఏఏ రద్దు చేయాలని కోరుతూ తీర్మానం చేయాలని నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తున్నామని చాడ వెంకటరెడ్డి చెప్పారు. అయితే కొన్ని జిల్లాల కలెక్టర్లు మాత్రం ఎన్‌పీఆర్ అమలుకు ఆదేశాలు , సర్క్యులర్లు జారీ చేస్తున్నట్టు తెలిసిందని తమ్మినేని వీరభద్రం తెలిపారు. ఇది సరికాదని, ప్రభుత్వం తన విధానాన్ని చాలా స్పష్టంగా చెప్పాలని అన్నారు.