తెలంగాణ

47 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 17: రాష్ట్రంలో రైతుల నుంచి 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆ ర్ 66 జన్మదిన సందర్భంగా 2020 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. సోమవారం పౌరసరఫరాల సంస్థ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డితో కలసి ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో పండించిన ధాన్యం కొనుగోలుకు 3670 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. దాదాపు 9.20 లక్షల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేశామన్నారు. వాస్తవంగా 47.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ఈ ఏడాది సకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయన్నారు. దీంతో పంట దిగుబడి గణనీయంగా పెరిగిందన్నారు. నిరంతర విద్యుత్, రైతుబంధు పథకంతో రైతులు సాగు ఎక్కువ చేశారన్నారు. ఏప్రిల్ నుంచి రబీ పంటకు సంబంధించి ధాన్యం కొనుగోలుకు కార్యచరణ రూపొందిస్తామన్నారు. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో 66వేల మొక్కలు నాటడం జరిగందన్నారు.
కార్యక్రమంలో సంస్థ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్యతను గుర్తించి ప్రతి ఒక్కరూ మొక్క నాటాలన్నారు. సమావేశంలో రైస్ మిల్లర్స్ అసోషియేషన్ గంప నాగేందర్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చేపడుతున్న సంక్షేమ పథకాలతో తెలంగాణ సమాజానికి మేలు జరుగుతోందన్నారు. సాగు, మంచినీటి సరఫరా కోసం భారీ ప్రాజెక్టులతో లక్షలాది బీడు భూములు సస్యశ్యామలంగా మారుతున్నాయని దీంతో రాష్ట్రంలో పచ్చదనం కన్పిస్తోందన్నారు.