తెలంగాణ

కంది రైతులూ.. ఆందోళన చెందొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, పిబ్రవరి 17: రాష్ట్రంలో కంది రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. కంది పండించిన రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ కంది రైతులకు బాసటగా ఉన్నారన్నారు. సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదిన సందర్భంగా కంది రైతులకు మద్దత్తు ధర కల్పించడానికి నిర్ణం తీసుకున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వంపై దాదాపు రూ. 200 కోట్ల ఆర్థిక భారం పడుతుందన్నారు. తెలంగాణలో ఉన్న బీడు భూములకు గోదావరి, కృష్ణ నదుల జలాలను తరలించడానికి సీఎం తగు చర్యలు తీసుకోబోతున్నారని ఆయన గుర్తు చేశారు.
ఖరీఫ్ సీజన్‌లో అద్భుతమైన పంటలు రైతు చేతికి వచ్చాయన్నారు. పత్తి, వరి కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. 2022 సంవత్సనానికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామన్నారు. కేంద్రం కేవలం నిధుల పంపిణీదారు మాత్రమే అన్నారు. హక్కుదారు కాదన్నారు. దళారులు అక్రమంగా కందులు తెచ్చి అమ్మితే జైలుకు పంపుతామన్నారు. అధికారులు దళారులకు సహకరిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఉపాధి రంగం పెరిగిన రాష్ట్రంగా తెలంగాణకే దక్కిందన్నారు. మీడియా సమావేశంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి, మార్క్‌ఫెడ్ ఎండీ భాస్కర్‌చారి, పంచాయతీ రాజ్ ట్రిబ్యునల్ చైర్మన్ బండారు బాస్కర్ పాల్గొన్నారు.