తెలంగాణ

ఐఐటీలో కృత్రిమ మేథస్సుపై సర్ట్ఫికెట్ కోర్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: ఐఐటీ హైదరాబాద్ ట్యాలెంట్ స్ప్రింట్ సహకారంతో కృత్రిమ మేథస్సుపై సర్ట్ఫికేట్ కోర్సును ప్రారంభించింది. ఆరు నెలల వ్యవధితో కూడిన ఈ కోర్సులో భాగంగా ఎఐ, ఐఓటీ, బ్లాక్ చెయిన్, క్వాంటం కంప్యూటింగ్, ఇతర అధునాతన టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తామని ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి చెప్పారు.
మొదట నిర్వహించిన సర్ట్ఫికేట్ ప్రోగ్రాంలో దేశంలోని 14 పట్టణాల్లోని 45 కాలేజీల నుండి 115 మంది హాజరయ్యారని, ఈ ప్రోగ్రాం చేసిన వారికి మార్కెట్‌లో విపరీతమైన గిరాకీ ఉందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్
కాలేజీయేట్ ఎడ్యుకేషన్, సాంకేతిక విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం, ఉన్నత విద్యామండలి, ఎలెట్స్ టెక్నోమీడియా, డిజిటల్ లెర్నింగ్ మ్యాగజైన్‌లు సంయుక్తంగా వరల్డ్ ఎడ్యుకేషన్ సమ్మిట్‌ను ఈ నెల 21 నుండి రెండు రోజుల పాటు హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నాయి.
ఈ సదస్సును విద్యా మంత్రి పీ సబితా ఇంద్రారెడ్డి ప్రారంభిస్తారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, నాగాలాండ్ మంత్రి తెమ్జన్ ఇమ్న అలాంగ్ , విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తదితరులు ప్రారంభ కార్యక్రమానికి హాజరవుతారు. వివిధ దేశాలు, ప్రాంతాల నుండి సుమారు 900 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు.
మార్చి 17 నుండి బీఈడీ పరీక్షలు
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ మొదటి, మూడో, ఐదో సెమిస్టర్ ఎంబీఏ మొదటి సంవత్సరం, రెండో సెమిస్టర్, బిఎల్‌ఐఎస్సీ విద్యార్ధులకు మార్చి 17 నుండి పరీక్షలు నిర్వహించనున్నట్టు వర్శిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు మార్చి 2వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు.