తెలంగాణ

సీఎం కేసీఆర్, ఒవైసీ మధ్య చీకటి ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని అందుకే ఈ రెండు పార్టీలు పౌరసత్వసవరణ చట్టం వ్యతిరేక ఆందోళనలపై తెలంగాణ రాష్ట్రంలో మెతకవైఖరితో ఉన్నాయని సీనియర్ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ధ్వజమెత్తారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు బహిరంగమైనా, పౌరసత్వసవరణ చట్టం విషయంలో మాత్రం ఆందోళనలకు తావులేకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయన్నారు. గురువారం ఇక్కడ ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొద్ది మంది ముస్లిం నేతలను తీసుకుని సీఏంను కలిసి సీఎం కేసీఆర్ రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారన్నారు. కాని ఇంతవరకు కేసీఆర్ నోరుమెదప లేదన్నారు. తెలంగాణ మంత్రివర్గంలో సీఏఏను వాపాస్ తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు. అసెంబ్లీలో సీఏఏపై చర్చిస్తామన్నారు. ఒవైసీ, సీఎం కేసీర్ మధ్య ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఒవైసీ ప్రతి రాష్ట్రం షాహిన్ బాగ్ కావాలని కోరుకుంటున్నారన్నారు. కాని హైదరాబాద్‌లో మాత్రం షాహిన్ బాగ్ వద్దంటున్నారన్నారు. ఇక్కడ మాత్రం ఒవైసీ ముస్లిం మహిళలపై కేసులు పెట్టిస్తున్నారన్నారు. ఇక్కడ దాదాపు వెయ్యి మంది ముస్లిం మహిళలపై కేసులు నమోదయ్యాయన్నారు. కేసీఆర్ కూడా సీఏఏకు వ్యతిరేకమన్నారని, జాతీయ జనాభా పట్టికపై మాట్లాడడం లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నేతలు కూడా కేసీఆర్ చెప్పినట్లు నడుచుకుంటున్నారని, ఉద్యోగుల్లో అభద్రతను సృష్టిస్తునాన్నరన్నారు.