తెలంగాణ

జనసంద్రం ఏడుపాయల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాపన్నపేట, ఫిబ్రవరి 22: తెలంగాణలో ప్రసిద్ధి చెందిన శ్రీ ఏడుపాయల వనదుర్గ్భావానిమాత పుణ్యక్షేత్రంలో జరుగుతున్న మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన శనివారం భక్తజనం వెల్లువెత్తింది. చెట్లు, రాళ్లగుట్టలతో ఉండే అటవీ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. జానపదుల జాతర జనరంజకంగా సాగింది. డప్పువాయిద్యాల మోతలు, బోనాల ఊరేగింపులు, శివసత్తుల శిగాలు, పోతరాజుల నృత్యాలతో ఏడుపాయల జాతర ప్రాంగణమంతా హోరెత్తింది. అడుగడుగునా తెలంగాణ జానపదుల సంస్కృతి ఆవిషృతమైంది. జాతరలో అత్యంత ప్రధానమైన బోనాల ఉత్సవం, బండ్ల ఉరేగింపు ఉండడంతో శనివారం రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుండి భక్తులు వెల్లువలా తరలివచ్చారు. భక్తులు, లారీలు, టెంపోలు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల రాకపోకలతో హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, నారాయణఖేడ్ తదితర ప్రాంతాల వైపునుండి ఏడుపాయల వైపు వచ్చే దారులన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వాహనాల సంఖ్య ఎక్కువగా ఉండడంతో నాగ్సాన్‌పల్లి నుండి ఏడుపాయల వరకు, పోతంశెట్టిపల్లి చౌరస్తా నుండి నూతనంగా ఏర్పాటైన రోడ్డు మీదుగా ఏడుపాయలకు గంటల తరబడి ట్రాఫిక్ స్తంభించింది. లక్షలాది మంది భక్తులు తరలిరావడంతో విశాలమైన ఏడుపాయల ప్రాంగణంలో ఎటుచూసినా భక్తజన సందోహమే కనిపించింది. రద్దీ విపరీతంగా
కనిపించడం, బోనాల ఉరేగింపు నిర్వహించడంతో దుర్గామాత ఆలయానికి వెళ్లే దారి ఉదయం నుండి రాత్రి వరకు పూర్తిగా కిటకిటలాడింది. మహిళా భక్తులు కాళ్లకు గజ్జలు కట్టుకొని, జుట్టు విరబోసుకొని, నెత్తిపై బోనం, ఆపై గండదీపం పెట్టుకొని, ముఖానికి పసుపు రాసుకొని, వేపకొమ్మలు చేతబూని, మెడలో గవ్వలహారాలు, పూలదండలు వేసుకొని చేతిలో కొరడ, నోటిలో నిమ్మకాయలు పట్టుకొని డప్పుల దరువులకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ ఉరేగింపులుగా వనదుర్గాదేవి ఆలయం వైపు సాగిపోతున్న దృశ్యాలు, పోతరాజుల నృత్యాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిభింబించాయి. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఈ సాంప్రదాయం పాటించడం ఆనవాయితీ. భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉండడంతో వనదుర్గామాత దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. మొక్కుబడుల్లో భాగంగా అనేక మంది భక్తులు అమ్మవారికి చీర, రవిక, గాజులు సమర్పించి ఒడి బియ్యం పోసి కోళ్లను, మేకలను బలిచ్చారు. వనదుర్గాదేవి సన్నిదిలో ప్రవహిస్తున్న పవిత్ర మంజీర పాయల్లో పుణ్య స్నానాలను భక్తులు ఆచరించారు. సంతానం లేనివారు సంతానగుండంలో దంపతులు స్నానాలు ఆచరించి దుర్గాదేవి ఆలయంలో కొబ్బరికాయలు కట్టారు. కొందరు భక్తులు తలనీలాలను ఇచ్చి కొబ్బరికాయలను, తొట్టెలను కట్టారు. వివిధ శాఖల అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, వైద్యం, శాంతి భద్రతల విషయంలో కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనా దీప్తి, డీఎస్పీ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, ఆలయ ఈఓ సారా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ప్రభుత్వం నియమించిన రెన్యువేషన్ కమిటీ సభ్యులు బాలాగౌడ్, దుర్గయ్య, సాయిరెడ్డి, వీరేశంతో పాటు డీఎంహెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు, డీపీఓ హనూక్, జిల్లా శాఖ అధికారుల ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం భక్తులకు విస్తృత సేవలందించింది.

*చిత్రం... వనదుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో భక్తుల జనసందోహం
*ఇన్‌సెట్‌లో భక్తులకు దర్శనమిస్తున్న వనదుర్గాదేవి అమ్మవారు