తెలంగాణ

వ్యాధి నిరోధక టీకాల్లో దక్షిణాదిన అగ్రగామి తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 22: వ్యాధి నిరోధక టీకాలను వేయడం ద్వారా రోగ నిరోధక రేటును పెంచడంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. 2019-20 సంవత్సరంలో తెలంగాణ 92.4 శాతంతో ముందంజలో ఉంది. 2017లో తెలంగాణ రేటు 72 శాతంగా నమోదైంది. రాష్ట్ర ఆరోగ్య శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు తీసుకున్న మెరుగైన చర్యల వల్ల వ్యాధి నిరోధక టీకాల్లో తెలంగాణ అగ్రస్థానం పొందింది. వ్యాధి నిరోధక టీకాల్లో ఫస్ట్‌గా నిలచిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సర్వేలో వెల్లడైంది. కేసీఆర్ కిట్స్ ప్రొగ్రాం హిట్టయిందని, మహిళలకు మెరుగైన వైద్య సేవలను అందించడంలో ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుందని కేంద్ర ఆరోగ్య సంక్షేమ శాఖ సర్వేలో పేర్కొన్నారు. మిగిలిన రాష్ట్రాలను విశే్లషిస్తే కేరళ 92.1 శాతంతో రెండవ స్థానంలో, కర్నాటక 91.8 శాతంతో, ఆంధ్రప్రదేశ్‌లో 89.3 శాతంతో, తమిళనాడు 82.1 శాతంతో ఉన్నాయి. 2015-16లో 68 శాతంతో, 2016-17లో 72 శాతంతో, 2017-18లో 91 శాతంతో, 2018-19లో 96 శాతంతో, 2019-20లో 92.4 శాతంతో తెలంగాణ వ్యాధి నిరోధక టీకాలను పిల్లలకు ఇచ్చింది. మొదటి పది రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడం పట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ స్వాగతించింది.