తెలంగాణ

యూసీలిస్తేనే నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: కేంద్రం నుంచి వచ్చే నిధులతో పాటు అదనపు నిధుల కోసం ఎప్పటికప్పుడు యూసీలు (యుటిలైజేషన్ సర్ట్ఫికేట్లు) ఇవ్వాలని ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను సరిగ్గా ఖర్చు చేయాలని సూచించారు. గిరిజన
సంక్షేమశాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై అరణ్యభవన్‌లో మంత్రి సత్యవతి రాథోడ్, సంబంధిత అధికారులతో ఆదివారం మంత్రి సమావేశం నిర్వహించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ నిధులు కేటాయిస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సకాలంలో యూసీలు సమర్పించకుంటే కేంద్రం నుంచి అదనపు నిధులు రావని హెచ్చరించారు. కేంద్రం నుంచి వచ్చే నిధులన్నింటినీ పొందే విధంగా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కేంద్రం, రాష్ట్రం కేటాయించే ప్రతి పైసా ఖర్చు చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖకు కోరిన విధంగా నిధులను కేటాయించడానికి ప్రయత్నం చేస్తానని మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మీ, పౌష్టికాహారం తదితర వాటిని గ్రీన్ ఛానల్‌లో పెట్టాలన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఇచ్చే ప్రతిపాదనలకు కోత పెట్టకుండా నిధులు కేటాయించాలని కోరారు. పెండింగ్ బిల్లులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం పట్ల మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, కార్యదర్శులు శ్రీదేవి, రోనాల్డ రాస్, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా, గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, అదనపు డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రత్యేక సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు