తెలంగాణ

మారనున్న పట్టణ రూపురేఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 23: పట్టణాల రూపు రేఖలు మార్చే లక్ష్యంగా రూపొందించిన ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం ప్రారంభం కానుంది. వచ్చే 4 వరకు పది రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మహబూబ్‌నగర్‌లో ప్రారంభించనున్నారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు పౌరుల సేవలను మరింత మెరుగు పర్చడం ప్రధాన లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభం అవుతున్న సందర్భంగా మున్సిపల్ పాలకవర్గాలకు, అధికారులకు దిశా నిర్దేశం చేస్తూ మంత్రి కేటీఆర్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్దేశించిన లక్ష్యాలను మున్సిపల్ పాలక వర్గాల ప్రజా ప్రతినిధులతో పాటు మున్సిపల్ అధికారులు నిబద్ధతతో ముందుకు కదలాలని మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల రూపు రేఖలు మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ మార్గదర్శకంలో పట్టణ ప్రగతి రూపుదిద్దుకుందన్నారు. పట్టణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు తీసుకరావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం కొనసాగాలని మంత్రి కేటీఆర్ సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు. పట్టణాల్లో ప్రజల జీవితాలను మరింత సౌకర్యంగా మార్చేందుకు అవసరమైన అన్ని కార్యక్రమాలను చేపట్టాలని మంత్రి అన్నారు. పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవల మెరుగు పర్చడం ఈ కార్యక్రమంలో ముఖ్యమైనవని గుర్తు చేశారు. పారిశుద్ధ్యం చెత్తను తరలించడంతో పాటు మురికి కాలువల శుభ్రం, బహిరంగ ప్రదేశాల శుభ్రపర్చడం వంటి కార్యక్రమాలను చేపట్టాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమం పర్యవేక్షణకు వార్డును ఒక యూనిట్‌గా తీసుకోవాలన్నారు. ఒక్కో వార్డుకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. పది రోజుల పాటు కొనసాగనున్న కార్యక్రమంలో ఏ రోజు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలో ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకోవాలన్నారు. పారిశుద్థ్యం, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ, పచ్చదనం, నర్సరీలు, పబ్లిక్ టాయిలెట్స్ కోసం అవసరమైన స్థలాలను ఎంపిక చేయాలన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరిచేందుకు అవసరమైన ప్రజారోగ్య పర్యవేక్షణ కార్యక్రమాలపై వార్షిక క్యాలండర్‌ను ప్రకటించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ప్రతి వార్డుకు కమిటీని ఏర్పాటు చేసి ప్రతి మూడు నెలలకోసారి వార్డు కమిటీల సమావేశం నిర్వహించాలన్నారు.