తెలంగాణ

భిన్నత్వంలో ఏకత్వం.. అదే దేశ విశిష్టత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సికిందరాబాద్, ఫిబ్రవరి 23: భిన్నత్వంలో ఏకత్వం అదే భారతదేశం యొక్క విశిష్టత అని భారతదేశ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. సికిందరాబాద్ రైల్వే స్పోర్ట్స్ మైదానంలో ఆదివారం జరిగిన అఖిల భారత పోలీస్ మ్యూజిక్ బ్యాండ్-2020 ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. పోటీలలో గెలుపొందినవారికి బహుమతుల ప్రదానం చేశారు.
ఈ సందర్భంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ సంగీతానికి ప్రజల హృదయాలను, మనస్సులను సమానంగా ఆకర్షించే శక్తి ఉన్నదని అన్నారు. సంగీతానికి దివ్యత్వం ఉందని అది ఉత్తమ తత్వాన్ని, సాహస పరాక్రమాలను తట్టి లేపుతుందని పేర్కొన్నారు. ఇబ్బందులకు గురైనప్పుడు ప్రజలు మొదట చూసేది పోలీసుల వైపే అన్న విషయాన్ని ఎప్పుడూ స్పూరణలో ఉండాలని సూచించారు. మీ యొక్క విధులను మీరు పరిపూర్ణంగా చేయండి అదే మీకు మంచి సంతృప్తిని, గుర్తింపును తీసుకు వస్తుంది పోలీసులకు తెలిపారు.
దేశంలో అలజడులు సృష్టించడానికి కొన్ని శక్తులు చూస్తున్నాయి, విద్రోహ శక్తులకు, టెర్రరిస్టులకు మన దాయాది దేశం ఒకటి అండదండలు, ఆర్థిక సహాకారం, శిక్షణను ఇస్తోందని పేర్కొన్నారు. కాబట్టి దేశంలోని పోలీసులందరూ అప్రమత్తంగా, కఠినంగా ఉండాలని పిలుపునిచ్చారు. మనం చూస్తున్నాము దేశంలోని వివిధ ప్రాంతాలలో అలజడులు వస్తున్నాయి, కొంత మంది అటువంటి అలజడులను ప్రోత్సహిస్తున్నారని గుర్తు చేశారు. పోలీసులే కాదు సమాజంలోని ప్రతి పౌరుడు ఆప్రమత్తంగా ఉండాలని సూచించారు. పలు శక్తుల ఎందుకోసం పుట్టుకొచ్చాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. దేశం యొక్క ఐక్యత, సమగ్రత, భద్రత కాపాడాలని అన్నారు. దేశం ప్రగతి పథంలో సాగుతుందని, విచ్ఛిన్నకర శక్తులను నిర్వీర్యం చేస్తూ అగ్రస్థానంలో నిలువ బోతుందని వెల్లడించారు. దేశంలోని పౌరులందరూ అప్రమత్తంగా, ఐక్యంగా, బలంగా ఉండాలని, తద్వారా బలమైన దేశంగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. పౌరులందరు దేశం కోసం ఆలోచించాలి, మన దృష్టిలో దేశం మొదటి స్థానంలో, వ్యక్తిగతం చివరి స్థానంలో ఉండాలి, విధులను అందంగా ఇష్టంగా చేస్తే అదే మిమ్మల్ని శక్తివంతులుగా చేస్తుందని తెలిపారు.
మనము అందమైన దేశంలో ఉన్నాము, ఆనేక రకాలైన వేష భాషలకు నెలవు మన భారతదేశం, వేషం వేరు, భాష వేరు కానీ మనదంతా ఒకటే దేశం అని వివరించారు. వివిధ రాష్ట్రాల నుంచి పోలీసుల ప్రదర్శన, మ్యూజిక్, వేరు వేరుగా ఉన్నాయి కాని అందరి ప్రదర్శనల సారాంశం దేశభక్తి, దేశ సమగ్రతను ప్రస్పుటం చేయడమే కాకుండా విధులపై వారికున్న గౌరవాన్ని, నిబద్దతను తెలిపాయని కొనియాడారు. పోటీలను నిర్వహించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీ, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, రైల్వే అధికారులకు, సహాకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ పోటీలలో బ్రాస్ బ్యాండ్‌లో మొదటి బహుమతి స్వర్ణం సీఆర్‌పీఎఫ్, ద్వితీయ బహుమతి రజతం జమ్మూ అండ్ కాశ్మీర్, రాజస్థాన్ పోలీసులు తృతీయ బహుమతి కాంస్య పతకాన్ని పొందారు. పైప్ బ్యాండ్‌లో మొదటి బహుమతి మహారాష్ట్ర, ద్వితీయ బహుమతి సీఆర్‌పీఎఫ్, ఒడిసా తృతీయ స్థానంలో నిలిచింది. కాగా బుగ్‌లర్స్ బ్యాండ్‌లో సీఆర్‌పీఎఫ్ మొదటి స్థానంలో, రాజస్థాన్ రెండవ స్థానంలో, మూడవ స్థానంలో అస్సాం రైఫిల్స్ నిలిచింది. ఆర్‌పీఎఫ్ పనితీరును వివరించే కాఫీటేబుల్ పుస్తకాన్ని ఉపరాష్టప్రతి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అరుణ్ కుమార్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా, అడిషనల్ జనరల్ మేనేజర్ బీబీ సింగ్, దక్షిణ మధ్య రైల్వే సెక్యూరిటీ కమిషనర్ ఈశ్వర్ రావు పాల్గొన్నారు.
*చిత్రాలు.. ఆర్‌పీఎఫ్ కాఫీటేబుల్ పుస్తకావిష్కరణ చేస్తున ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
*ట్రోఫీని ప్రదానం చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు