తెలంగాణ

మంత్రి సమక్షంలో ఎంపీటీసీల నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 23: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి కొనసాగిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమంలో ఎంపీటీసీలను కూడా భాగస్వాములను చేయాలని, ప్రజలతో ఎన్నుకున్న ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని పలువురు ఎంపీటీసీలు ఆందోళన వ్యక్తం చేస్తూ పంచాయతీరాజ్ సమ్మేళనం వేదిక ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఆదివారం పాలెంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన నాగర్‌కర్నూల్ జిల్లా స్థాయి పంచాయతీరాజ్ సమ్మేళనం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ పద్మావతి, జిల్లా కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి సూచనల మేరకు పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు వేదికపైకి ఒక్కొక్కరు వచ్చి ప్రసంగిస్తున్న సమయంలో కొంతమంది ఎంపీటీసీలు ఒక్కసారిగా వేదికముందుకు వచ్చి బైఠాయించి ఎంపీటీసీలకు బాధ్యతలు, హక్కులు కల్పించాలని, ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వాములను చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ పార్టీ గుర్తుపై రెండు, మూడు గ్రామాలకు కలిపి ఎంపీటీసీగా గెలిచామని, కాని తగిన గుర్తింపు మాత్రం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నప్పటికీ సర్పంచ్‌లు గాని, అధికారులు గాని సమాచారం కూడా ఇవ్వడంలేదని, తమకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగిస్తే అభివృద్ధి పనులలో భాగస్వాములం అవుతామంటూ పలు డిమాండ్లు చేశారు.
నిరసన తెలుపుతున్న ఎంపీటీసీలతో అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు మాట్లాడుతూ ఎంపీటీసీల సమస్యలను మంత్రితో పాటు తోటి ఎమ్మెల్యేలతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకొనిపోతామని, వారు అడిగే డిమాండ్లలో న్యాయం ఉందని, కాని ఇది సరైన వేదిక కాదని, ఈవిధంగా నిరసన తెలిపితే దేనిని కూడా సాధించలేమని, ఏదైనా చెప్పదల్చుకుంటే ప్రసంగం ద్వారా తెలియచేయాలని సూచించడంతో ఎంపీటీసీలు నిరసన విరమించారు. ఇది ఇలా ఉండగా మంత్రి నిరంజన్‌రెడ్డి తన ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ గత 10 ఏళ్ల నుంచి ఎంపీటీసీల తరపున తాను కూడా పోరాడానని, ఎంపీటీసీల డిమాండ్లపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని పోయి చర్చిస్తానని హామీ ఇచ్చారు.
సర్పంచ్‌లు చేపట్టే కార్యక్రమంలో ఎంపీటీసీలను భాగస్వాములను చేయాలని ఆయన సూచించారు.

*చిత్రం... పాలెంలో జరిగిన పంచాయతీరాజ్ సమ్మెళనంలో నిరసన తెలుపుతున్న ఎంపీటీసీలు