తెలంగాణ

హైదరాబాద్ ఆర్‌జేసీగా రామకృష్ణారావు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: దేవాదాయ శాఖలో హైదరాబాద్ రీజనల్ జాయింట్ డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతలను డిప్యూటీ కమిషనర్ ఎం. రామకృష్ణారావుకు అప్పగిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు రెవెన్యూ (దేవాదాయ) శాఖ కార్యదర్శి వి. అనిల్ కుమార్ పేరుతో సోమవారం జీఓ (ఆర్‌టీ నెంబర్ 84) జారీ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ బాధ్యల్లో అడిషనల్ కమిషనర్ ఈ. శ్రీనివాసరావు కొనసాగుతున్నారు. శ్రీనివాసరావు నుండి బాధ్యతలను రామకృష్ణారావుకు అప్పగించారు. పరిపాలనా పరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని జీఓలో స్పష్టం చేశారు.