తెలంగాణ

దేశ ఔన్నత్యాన్ని పెంచిన మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 24: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ దేశ ఔన్నత్యాన్ని పెంచే రీతిలో వ్యవహరించారని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ వ్యాఖ్యానించింది. భారత పర్యటనలో భాగంగా సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించడంతో పాటు ఇతర ప్రాంతాలను సందర్శించడం వల్ల దేశ ఔన్నత్యం, ప్రతిష్ట పెరిగిందని , ట్రంప్ సైతం తన పర్యటనలో ఉపన్యసిస్తూ నరేంద్రమోదీ ఖ్యాతిని ప్రస్తుతించారని తద్వారా ప్రపంచంలో భారత్ గొప్పతనాన్ని గుర్తుచేసినట్టయిందని కోర్ కమిటీ సభ్యులు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు , వివిధ విభాగాలు, మోర్చాల నేతలు పాల్గొన్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో శరవేగంగా భారత్ అభివృద్ధి చెందుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభినందించడం గుర్తించదగిన అంశమని వారు పేర్కొన్నారు.